News January 2, 2026
సంగారెడ్డి: ‘యూరియా కోసం ఆందోళన చెందవద్దు’

జిల్లాలో సరిపడా యూరియా ఉందని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శివప్రసాద్ గురువారం తెలిపారు. జిల్లాలో 4,441 మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉందని చెప్పారు. దశలవారీగా రైతులకు యూరియాను అందిస్తామని పేర్కొన్నారు. రైతులు అవసరం ఉన్నప్పుడు మాత్రమే యూరియాను కొనుగోలు చేయాలని కోరారు.
Similar News
News January 11, 2026
భీమవరంలో రౌడీయిజం.. మద్యం మత్తులో దాడి!

భీమవరం రైతు బజార్ సమీపంలోని వైన్ షాప్ వద్ద మద్యం మత్తులో ముగ్గురు వ్యక్తులు ఒకరిపై దాడి చేసి గాయపరిచారు. బాధితుడి ఫిర్యాదుతో వన్ టౌన్ ఎస్సై కిరణ్ కుమార్ కేసు నమోదు చేశారు. ప్రజాశాంతికి భంగం కలిగించినా, శాంతి భద్రతలకు విఘాతం కలిగించినా కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ నాగరాజు హెచ్చరించారు. నిందితులపై చట్టరీత్యా చర్యలు చేపడతామని స్పష్టం చేశారు.
News January 11, 2026
మేడారం జాతరలో 3,199 మందితో వైద్య సేవలు

ఈ నెల 28 నుంచి మొదలయ్యే మేడారం శ్రీ సమ్మక్క, సారమ్మ జాతరలో భక్తులకు వైద్య సేవలు అందించడానికి 3,199 మంది వైద్య సిబ్బంది వినియోగించుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. పూర్వ వరంగల్, ఖమ్మం జిల్లాల నుంచి 72 మంది స్పెషలిస్టులు, 42 మంది స్త్రీ వైద్య నిపుణులతో కలిపి 544 మంది వైద్యులు విధుల్లో ఉంటారు. మరో 2,150 మంది పారా మెడికల్ సిబ్బంది షిప్ట్‌ల వారీగా 24 గంటల పాటు సేవలు అందించేలా ప్రణాళిక సిద్ధం చేశారు.
News January 11, 2026
HYD: GHMCలో విలీనం.. ఇక కుదరదు

GHMCలో మున్సిపాలిటీల విలీనం తర్వాత అనధికారిక హోర్డింగులు, బ్యానర్లు, ప్రకటనా నిర్మాణాలపై అధికారులు నగరవ్యాప్త స్పెషల్ డ్రైవ్‌ను చేపట్టారు. ప్రజా, రోడ్డు భద్రత, నగర సౌందర్యం కాపాడేందుకు ఈ చర్యలు తీసుకుంటున్నామని అధికారులు తెలిపారు. అన్నీ జోన్లలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసిన GHMC దశలవారీగా నిరంతరం ఈ డ్రైవ్‌ను చేపడుతుంది. అనధికారిక ప్రకటనలను ఏర్పాటు చేస్తే కఠినచర్యలు చేపడతామని హెచ్చరించింది.


