News February 24, 2025
సంగారెడ్డి: రంజాన్ మాసం కోసం అన్ని ఏర్పాట్లు చేయండి: కలెక్టర్

ముస్లింలు పవిత్రంగా భావించే రంజాన్ మాసంలో అన్ని ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులకు కలెక్టర్ వల్లూరు క్రాంతి ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో సోమవారం సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. పట్టణాలు, గ్రామాల్లో శానిటేషన్ మెరుగ్గా ఉండేలా చూడాలని చెప్పారు. ఇఫ్తార్ విందులు ఏర్పాటు చేసే చోట్ల సౌకర్యాలు కల్పించాలని పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఎస్పి రూపేష్, అధికారులు పాల్గొన్నారు.
Similar News
News February 24, 2025
పెండింగ్ కేసులను పరిష్కరించాలి: అనకాపల్లి ఎస్పీ

నిర్దిష్ట ప్రణాళికతో పాత పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరించాలని అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహీన్ సిన్హా పేర్కొన్నారు. జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం జరిగిన నెలవారీ నేర సమీక్షలో ఆయన మాట్లాడారు. రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు ప్రణాళికాబద్ధంగా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. చార్జిషీట్లు, సమన్లు పెండింగ్‌లో లేకుండా చూడాలన్నారు.
News February 24, 2025
అర్జీలను నాణ్యతగా పరిష్కారించండి: సబ్ కలెక్టర్

ఆదోని సబ్ కలెక్టరేట్లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం చేపట్టారు. కార్యక్రమంలో డివిజన్ స్థాయి అధికారులు పాల్గొని ప్రజల వినతి పత్రాలను స్వీకరించారు. నిర్ణీత గడువులోపు ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను త్వరగా పరిష్కరించాలని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ అధికారులకు సూచించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ బియాండ్ ఎస్ఎల్‌ఏ లోకి వెళ్లకుండా చూడాలన్నారు.
News February 24, 2025
KCR, KTR ఎవరికి ఓటేస్తారు?: CM రేవంత్

TG: MLC ఎన్నికల్లో KCR, KTR, హరీశ్, కవిత సహా ఇతర BRS నేతలు ఎవరికి ఓటేస్తారని CM రేవంత్ ప్రశ్నించారు. కరీంనగర్‌లో మాట్లాడుతూ ‘ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఓడించాలని BRS నేతలు చెబుతున్నారు. వారు ఎవరిని గెలిపించడానికి ప్రయత్నిస్తున్నారో చెప్పాలి. ఉప ఎన్నికలు వస్తే గెలుస్తామని అంటున్న వాళ్లు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎందుకు పోటీ చేయడం లేదు? కేసులకు భయపడి బీజేపీకి మద్దతు ఇస్తున్నారు’ అని ఆరోపించారు.