News March 29, 2025

సంగారెడ్డి: రాజీవ్ యువ వికాసం పథకానికి దరఖాస్తుల ఆహ్వానం

image

రాజీవ్ యువ వికాసం పథకానికి అర్హులైన నిరుద్యోగ అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ వల్లూరు క్రాంతి ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు https://tgobmmsnew.cgg.gov.in వెబ్ సైట్‌లో ఏప్రిల్ 5వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. 21 నుంచి 55 ఏళ్లు ఉన్నవారు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Similar News

News March 31, 2025

అరుణాచల్ ప్రదేశ్‌లో స్వల్ప భూకంపం

image

ఇవాళ మధ్యాహ్నం 2.38 గంటలకు అరుణాచల్‌ ప్రదేశ్‌లోని షియోమీలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై దీని తీవ్రత 3.5గా నమోదైనట్లు అధికారులు తెలిపారు. భూప్రకంపనలకు భయంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటికి పరుగులు తీశారు. ఇటీవల మయన్మార్, థాయ్‌లాండ్ సహా భారత్‌లోని మేఘాలయ, కోల్‌కతా, ఢిల్లీలోనూ భూకంపం సంభవించిన విషయం తెలిసిందే.

News March 31, 2025

మోదీకి ప్రైవేట్ సెక్రటరీగా నిధి తివారీ.. ఎవరీమె?

image

PM మోదీకి ప్రైవేట్ సెక్రటరీగా IFS అధికారిణి నిధి తివారీ నియమితులయ్యారు. 2014 బ్యాచ్‌(UP)కు చెందిన ఈమె తొలుత వాణిజ్య పన్నుల శాఖలో అసిస్టెంట్ కమిషనర్‌గా పనిచేశారు. ఆ తర్వాత విదేశాంగ శాఖలో కీలక బాధ్యతలు నిర్వర్తించారు. 2022లో PMOలో అండర్ సెకట్రరీగా చేరి డిప్యూటీ సెక్రటరీగా ప్రమోషన్‌ పొందారు. అంతర్జాతీయ సంబంధాల్లో ఉన్న నైపుణ్యంతో ఆమె ఇప్పుడు 35 ఏళ్లకే PMOలో కీలక స్థాయికి వచ్చారు.

News March 31, 2025

కార్యకర్తలే టీడీపీకి అధినేతలు: లోకేశ్

image

టీడీపీకి కార్యకర్తలే అధినేతలని మంత్రి నారా లోకేశ్ అన్నారు. అచ్యుతాపురంలో సోమవారం పార్టీ కార్యకర్తల సమన్వయ కమిటీ సమావేశంలో ఆయన ప్రసంగించారు. పార్టీ కార్యకర్తలు నాయకులు అందరూ కలిసికట్టుగా పోరాటం చేసి చరిత్రను తిరిగి రాశారని తెలిపారు. నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు పార్టీ ఇన్‌ఛార్జ్‌లు వారానికి ఒకరోజు పార్టీ కార్యకర్తలను కలిసి సమస్యలను పరిష్కరించాలన్నారు.

error: Content is protected !!