News December 10, 2025
సంగారెడ్డి: రిజర్వేషన్ల కోసం అన్ని పార్టీల నేతలను కలుస్తున్నాం

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్ కల్పించాలని కోరుతూ ఢిల్లీలో అన్ని పార్టీల నాయకులను కలుస్తున్నామని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రభు గౌడ్ అన్నారు. ఢిల్లీలో బుధవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బీసీలకు రిజర్వేషన్లు సాధించే వరకు తమ పోరాటం కొనసాగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు మల్లికార్జున్ పటేల్ పాల్గొన్నారు.
Similar News
News December 15, 2025
స్టూడెంట్స్ సంఖ్య ఆధారంగానే ‘కుక్’లు

TG: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను బట్టి వంట మనుషుల సంఖ్య ఉండాలని DEOలకు స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. స్కూళ్లలో 25 మంది స్టూడెంట్స్ ఉంటే కుక్ కమ్ హెల్పర్‌ను, 26-100 మధ్య ఉంటే ఇద్దరు హెల్పర్లు, 101-200 మధ్య ఉంటే ముగ్గురు హెల్పర్లను తీసుకోవాలన్నారు. ఆపై ప్రతి 100 మందికి ఒక అదనపు హెల్పర్‌ను నియమించుకోవచ్చన్నారు. సంబంధిత బిల్లులు ఆన్‌లైన్ ద్వారా క్లైయిమ్ చేయాలని తెలిపారు.
News December 15, 2025
WGL: బ్యాలెట్ పేపర్ ఓటు వినియోగంలో తప్పిదాలు!

ఉమ్మడి జిల్లాలో 2వ దశ పోలింగ్ ముగిసింది. బ్యాలెట్ విధానంతో జరుగుతున్న ఈ ఎన్నికల్లో చిత్ర విచిత్ర విషయాలు వెలుగులోకొస్తున్నాయి. వృద్ధులకు ఓటు ఎలా వేయాలో తెలియలేదట. యువత సైతం కొంత మంది ఇదే తోవలో నడిచారు. బ్యాలెట్ పేపర్ పై స్వస్తిక్ బదులు వేలి ముద్ర వేయడం, గుర్తుపై కాకుండా మడత పెట్టీ ఇచ్చిన పేపర్‌పై స్వస్తిక్ వేయడం, కొంత మంది రెండు బ్యాలెట్ పేపర్లు ఇస్తే ఒకటే వేసి మరొకటి జేబులో పెట్టుకున్నారట.
News December 15, 2025
SRD: కాంగ్రెస్‌లో నామినేషన్ వేసి BRSలో గెలిచాడు!

ఎన్నికల్లో కాంగ్రెస్‌లో సర్పంచ్ టికెట్ రావడంతో సంతోషించి నామినేషన్ వేశాడు. తీరా చూస్తే ఆ పార్టీ మరొకరికి మద్దతు తెలపడంతో బీఆర్ఎస్‌లో చేరాడు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం శేఖాపూర్ సర్పంచ్‌గా బీఆర్ఎస్ మద్దతుతో చస్మొద్దీన్ భారీ విజయాన్ని సాధించాడు. ఏకంగా 1766 ఓట్ల భారీ మెజారిటీతో గెలిచాడు.


