News December 20, 2025
సంగారెడ్డి: రూమ్‌లో లవర్స్.. నాన్న ఎంట్రీతో విషాదం!

8వ అంతస్తు నుంచి జారిపడి యువతి మృతిచెందిన ఘటన SRDజిల్లా రామచంద్రపురం మం.లో జరిగింది. వివరాలు.. HYDకు చెందిన యువతి(20) ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తుంది. అక్కడ ఓ యువకుడితో పరిచయం ఏర్పడింది. కొల్లూర్ 2BHKలో ఉన్న ఇంటికి యువతి ఆ యువకుడితో వచ్చింది. ఆ సమయంలో తండ్రి ఇంటికి రావడంతో భయపడిన ఆమె బాల్కనీ గుండా పక్క ఫ్లాట్‌కు వెళ్లే ప్రయత్నంలో జారిపడి మృతిచెందింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Similar News
News December 20, 2025
‘సంక్రాంతి’ బరిలో ఐదు తెలుగు సినిమాలు!

వచ్చే సంక్రాంతిని క్యాచ్ చేసుకునేందుకు టాలీవుడ్ మూవీస్ సిద్ధమవుతున్నాయి. డార్లింగ్ ప్రభాస్ ‘రాజాసాబ్’(JAN 9)తో పండుగ మొదలవనుంది. ఆ తర్వాత 12న మెగాస్టార్ చిరంజీవి ‘మన శంకరవరప్రసాద్ గారు’, 13న రవితేజ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రాలు సందడి చేయనున్నాయి. 14న నవీన్ పొలిశెట్టి ‘అనగనగా ఒక రాజు’, 15న శర్వానంద్ ‘నారీ నారీ నడుమ మురారి’ మూవీస్ విడుదలవనున్నాయి. మీరు దేనికోసం ఎదురుచూస్తున్నారు? comment
News December 20, 2025
అడ్డతీగల: చికిత్స పొందుతూ ఉద్యోగి మృతి

అడ్డతీగల లేబర్ ఆఫీస్‌లో జూనియర్ అసిస్టెంట్‌గా పని చేస్తున్న బి.రామకృష్ణ (30) అనారోగ్యంతో శనివారం మృతి చెందారు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. వారం రోజుల క్రితం అతనికి చెస్ట్ పెయిన్ రావడంతో రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు చెప్పారు. ఆయన గతంలో రంపచోడవరంలో కూడా పని చేశారు. ఆయన స్వగ్రామం రంపచోడవరం మండలం దేవరాతిగూడెం.
News December 20, 2025
ఇంట్లోనే మానిక్యూర్ చేసుకోవచ్చు

అందంగా, ఆరోగ్యంగా ఉండే గోళ్ల కోసం మానిక్యూర్ చేసుకోవడం తప్పనిసరి. దీన్ని ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. ముందుగా పాత నెయిల్ పాలిష్‌ని తొలగించాలి. తర్వాత గోళ్లను షేప్ చేసుకొని గోరువెచ్చటి నీటిలో షాంపూ, నిమ్మరసం కలిపి దాంట్లో చేతులు ఉంచాలి. తర్వాత చేతులను స్క్రబ్ చేసుకొని మాయిశ్చరైజర్ రాసుకోవాలి. చివరిగా మీకు నచ్చిన నెయిల్ పాలిష్ వేస్తే సరిపోతుంది. లేత రంగులు వేస్తే గోళ్లు సహజంగా అందంగా కనిపిస్తాయి.


