News October 3, 2025
సంగారెడ్డి రూరల్ ఎస్సై సస్పెండ్

సంగారెడ్డి రూరల్ ఎస్సై రవీందర్‌పై ఎస్పీ సస్పెన్షన్ వేటు వేశారు. ఓ కేసు విచారణలో ఎస్సై లంచం డిమాండ్ చేయడంతో పాటు, ఆయన వేధింపుల వల్లే లోకేష్ మంజీరా నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు మృతుడి భార్య ఫిర్యాదు చేసింది. దీంతో మల్టీజోన్-2 ఐజీ ఆదేశాలతో ఎస్సైపై శాఖాపరమైన చర్యలు తీసుకుని సస్పెండ్ చేసినట్లు అధికారులు తెలిపారు. విధి నిర్వహణలో అవినీతి వహిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ హెచ్చరించారు.
Similar News
News October 4, 2025
అమృత్ పనులు వేగవంతంగా చేపట్టాలి: కలెక్టర్

అమృత్ పనులు వేగవంతంగా చేపట్టాలని కలెక్టర్ ఆనంద్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం అనంతపురం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాల్ వద్ద అమృత్ పథకం పనులు, టిడ్కో ఇళ్ల నిర్మాణం తదితర అంశాలపై పబ్లిక్ హెల్త్, నగర పాలక సంస్థ, టిడ్కో అధికారులు, మున్సిపల్ కమిషనర్లతో సమీక్షించారు. మొదటి దశ పనులు నెల రోజుల్లో ట్రయల్ రన్ పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
News October 4, 2025
HEADLINES

* కడపలో 2028లోగా జిందాల్ ఉక్కు ఫ్యాక్టరీ పూర్తి: CM CBN
* కూటమిది దద్దమ్మ ప్రభుత్వం: YCP
* రేవంత్ పాలనలో ఆర్థిక విధ్వంసం: KTR
* స్థానిక ఎన్నికలకు సిద్ధంగా ఉన్నట్లు TG ఎన్నికల సంఘం ప్రకటన
* ఏపీ ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల
* పాక్‌ను ప్రపంచ పటం నుంచి లేపేస్తాం: ఆర్మీ చీఫ్
* WIతో టెస్ట్.. రాహుల్, జురెల్, జడేజా సెంచరీలు
News October 4, 2025
హైవేలపై పొలిటికల్ రోడ్ షోలు, ర్యాలీపై మద్రాస్ HC నిషేధం

TNలోని కరూర్ తొక్కిసలాట నేపథ్యంలో మద్రాస్ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలోని స్టేట్, నేషనల్ హైవేలపై పొలిటికల్ రోడ్ షోలు, ర్యాలీలపై నిషేధం విధించింది. స్టాండర్డ్స్ ఆపరేటింగ్ ప్రొసీజర్(SOPs) నిబంధనలు రూపొందించే వరకు ఈ బ్యాన్ అమల్లో ఉంటుందని స్పష్టం చేసింది. కరూర్ లాంటి ఘటనలు మళ్లీ చోటు చేసుకోకుండా స్పష్టమైన నిబంధనలు రూపొందించాలంటూ దాఖలైన పిటిషన్లపై విచారణలో ఈ తీర్పిచ్చింది.