News September 15, 2025
సంగారెడ్డి: ‘రెండో జత యూనిఫాం వివరాలు నమోదు చేయాలి’

సంగారెడ్డి జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలు రెండో జత యూనిఫాం వివరాలను ఐఎస్‌ఎంఎస్ (ISMS) పోర్టల్‌లో వెంటనే నమోదు చేయాలని జిల్లా విద్యాధికారి (డీఈఓ) వెంకటేశ్వర్లు సోమవారం ఆదేశించారు. అన్ని మండలాల విద్యాధికారులు ఈరోజు సాయంత్రం 5 గంటలలోగా ఈ పక్రియను పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. వివరాలు నమోదు చేయని పాఠశాలలపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.
Similar News
News September 15, 2025
ఏడాదిలో 19 మందిపై పోక్సో కేసులో శిక్ష: నల్గొండ ఎస్పీ

గడిచిన సంవత్సరంలో నల్గొండ జిల్లాలో పోక్సో చట్టం కింద 18 కేసులలో 19 మంది నిందితులకు శిక్ష పడిందని ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు. మైనర్ బాలికలపై అత్యాచారాలకు పాల్పడితే శిక్ష తప్పదని ఆయన హెచ్చరించారు. ఈ కేసులలో సకాలంలో సాక్ష్యాధారాలు సేకరించి, ఛార్జిషీట్ దాఖలు చేసి, నిందితులకు శిక్ష పడేలా కృషి చేసిన పోలీస్ సిబ్బందిని ఎస్పీ అభినందించారు.
News September 15, 2025
కోనసీమ జిల్లా ఎస్పీ కార్యాలయంలో 23 అర్జీలు

కోనసీమ జిల్లా ఎస్పీ కార్యాలయంలో 23 అర్జీలు వచ్చినట్లు జిల్లా ఎస్పీ కార్యాలయం సోమవారం తెలిపింది. ఫిర్యాదుదారులతో నేరుగా ఎస్పీ రాహుల్ మీనా మాట్లాడి వారి సమస్యలను క్షుణ్ణంగా విన్నారు. కుటుంబ తగాదాలు, భూ వివాదాలు, ఫిర్యాదుల రూపంలో వచ్చినట్లు ఆయన తెలిపారు. కేసుల పరిష్కారంలో చిత్తశుద్ధి కనపరచాలని పోలీస్ సిబ్బందిని ఆయన ఆదేశించారు.
News September 15, 2025
ఉద్యోగాల పేరుతో మోసపోకండి: కర్నూలు SP

ఉద్యోగుల పేరుతో నిరుద్యోగులు మోసపోవద్దని.. పోటీ పరీక్షల ప్రతిభ ఆధారంగానే ఉద్యోగాలు వస్తాయని కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ స్పష్టం చేశారు. ఎస్పీ క్యాంపు కార్యాలయంలో సోమవారం గ్రీవెన్స్ డే నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. ఈ కార్యక్రమానికి 81 ఫిర్యాదులు వచ్చాయన్నారు. వాటిని త్వరగా పరిష్కరిస్తామన్నారు. అడిషనల్ ఎస్పీ హుస్సేన్ పీరా తదితరులు ఉన్నారు.