News December 12, 2025

సంగారెడ్డి: రెండో విడతకు 1,200 మందితో బందోబస్తు

image

రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో జరిగే 10 మండలాల్లో 1,200 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు పరితోష్ పంకజ్ తెలిపారు. సంగారెడ్డి జిల్లా పోలీసు కార్యాలయంలో శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల మెటీరియల్ డిస్ట్రిబ్యూషన్ నుంచి పోలింగ్ కౌంటింగ్ ముగిసే వరకు బందోబస్తు ఉంటుందని చెప్పారు. సమావేశంలో అదనపు ఎస్పీ రఘునందన్ రావు పాల్గొన్నారు.

Similar News

News December 15, 2025

పొట్టి శ్రీరాములు సేవలు చిరస్మరణీయం: కలెక్టర్ ఆనంద్

image

అమరజీవి పొట్టి శ్రీరాములు భాషా ప్రయుక్త రాష్ట్రాలకు ఆద్యులని, ఆయన సేవలు చిరస్మరణీయమని, భావితరాలకు ఆదర్శనీయమని జిల్లా కలెక్టర్ ఆనంద్ పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్‌లోని రెవెన్యూ భవనంలో ఏర్పాటు చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ శివ నారాయణ శర్మ కూడా పాల్గొన్నారు.

News December 15, 2025

చేగుంట: 4 ఓట్ల తేడాతో గెలుపు

image

చేగుంట మండలం పోలంపల్లి సర్పంచిగా కొండి రాజ్యలక్ష్మి విజయం సాధించారు. బీజేపీ బలపరిచిన అభ్యర్థి రాజ్యలక్ష్మి సమీప ప్రత్యర్థి తప్ప మేనకపై 4 ఓట్ల తేడాతో గెలుపొందారు. దీంతో సర్పంచ్ అనుచరులు గ్రామంలో టపాసులు కాల్చి సంబరాలు చేసుకున్నారు. తమకు ఓటు వేసి గెలిపించిన గ్రామ ప్రజలకు వారు ధన్యవాదాలు తెలియజేశారు. ప్రజలకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.

News December 15, 2025

వారిది పాకిస్థాన్.. ఐసిస్‌తో లింకులు!

image

ఆస్ట్రేలియాలో కాల్పులకు తెగబడిన <<18568131>>తండ్రీకొడుకులు<<>> పాకిస్థాన్ నుంచి వచ్చినట్లు తెలుస్తోంది. బాండీ బీచ్‌లో వారి కారుపై ఐసిస్ జెండాలను అధికారులు గుర్తించారు. ప్రాణాలతో పట్టుబడిన నవీద్‌ అక్రమ్‌కు ఐసిస్‌తో సంబంధాలున్నట్లు సమాచారం. ఆరేళ్ల కిందట అతడిపై దర్యాప్తు చేసినట్లు ఆసీస్ మీడియా తెలిపింది. నిందితుల్లో ఒకరు నిఘా రాడార్‌లో ఉన్నప్పటికీ, అతడి నుంచి తక్షణ ముప్పులేదని సీరియస్‌గా తీసుకోలేదని సమాచారం.