News December 13, 2025

సంగారెడ్డి: రెండో విడతలో మహిళా ఓటర్లే కీలకం

image

రెండో విడత పంచాయతీ ఎన్నికలు జరిగే 10 మండలాల్లో మహిళ ఓటర్లు కీలకం కానున్నారు. మొత్తం 2,99,746 మంది ఓటర్లు ఉండగా.. వీరిలో పురుషులు 1,47,746, మంది మహిళలు 2,51,757 మంది ఉన్నారు. పురుషుల కంటే మహిళ ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. దీంతో మహిళా ఓటర్ల కోసం అభ్యర్థులు ప్రసన్నం చేసుకుంటున్నారు. వేరే ఎవరికి ఓటు వేస్తారో 14వ తేదీ వరకు వేచి చూడాల్సిందే.

Similar News

News December 15, 2025

SRD: కాంగ్రెస్‌లో నామినేషన్ వేసి BRSలో గెలిచాడు!

image

ఎన్నికల్లో కాంగ్రెస్‌లో సర్పంచ్ టికెట్ రావడంతో సంతోషించి నామినేషన్ వేశాడు. తీరా చూస్తే ఆ పార్టీ మరొకరికి మద్దతు తెలపడంతో బీఆర్ఎస్‌లో చేరాడు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం శేఖాపూర్ సర్పంచ్‌గా బీఆర్ఎస్ మద్దతుతో చస్మొద్దీన్ భారీ విజయాన్ని సాధించాడు. ఏకంగా 1766 ఓట్ల భారీ మెజారిటీతో గెలిచాడు.

News December 15, 2025

స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ

image

AP: గ్రామ, వార్డు సచివాలయాల నుంచి స్మార్ట్ రేషన్ కార్డులను ఫ్రీగా తీసుకోవడానికి ఇవాళే చివరి తేదీ. ఇప్పటికీ తీసుకోకపోతే ఆ కార్డులను కమిషనరేట్‌కు పంపుతారు. అయితే రేషన్‌కార్డుదారులెవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదు. సచివాలయాల్లో రూ.200 చెల్లించి దరఖాస్తు చేసుకుంటే నేరుగా ఇంటికే పంపిస్తామని అధికారులు తెలిపారు. ATM తరహాలోని ఈ కార్డులపై ఉండే QR కోడ్‌ను స్కాన్ చేస్తే కుటుంబం పూర్తి వివరాలు తెలుస్తాయి.

News December 15, 2025

భద్రకాళి ఆలయంలో భక్తుల సందడి

image

వరంగల్ భద్రకాళి ఆలయం రెండో విడత పంచాయతీ ఎన్నికల ఫలితాల రాకతో భక్తులతో కిటకిటలాడింది. ఎన్నికల్లో విజయం సాధించిన సర్పంచులు, వారి అనుచరులు, అలాగే విజయం కోసం మొక్కుకున్న భక్తులు ఉదయం నుంచే భారీ సంఖ్యలో ఆలయానికి తరలివచ్చారు. ప్రత్యేక పూజలు, అమ్మవారి దర్శనం కోసం గుడి ప్రాంగణం భక్తిశ్రద్ధలతో మార్మోగింది.