News December 13, 2025

సంగారెడ్డి: రెండో విడత.. మొత్తం జోన్లు 46

image

ఈనెల 14న 10 మండలాల్లో జరిగే రెండో విడత పంచాయతీ ఎన్నికలకు సిబ్బందిని నియమించినట్లు సంగారెడ్డి కలెక్టర్ ప్రావీణ్య శుక్రవారం తెలిపారు. మొత్తం జోన్లు 46, రూట్లు 56, డిస్ట్రిబ్యూషన్ సెంటర్లు 10, మైక్రో అబ్జర్వర్లు 10మంది, వెబ్ కాస్టింగ్ కేంద్రాలు 436 ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఎన్నికల సిబ్బంది 13న విధుల్లో చేరాలని సూచించారు.

Similar News

News December 14, 2025

BREAKING: మెదక్‌లో తొలి ఫలితం

image

మెదక్ మండలం బాలానగర్ సర్పంచ్‌గా బెండ వీణ విజయం సాధించారు. బీజేపీ బలపరిచిన అభ్యర్థి వీణ సమీప ప్రత్యర్థిపై గెలుపొందారు. వీణ మెదక్ జిల్లా బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు. దీంతో సర్పంచ్ అనుచరులు గ్రామంలో టపాసులు కాల్చి సంబరాలు చేసుకుంటున్నారు. తమకు ఓటు వేసి గెలిపించిన గ్రామ ప్రజలకు ఆమె ధన్యవాదాలు తెలియజేశారు. ఎంపీ రఘునందన్ రావు సహకారంతో గ్రామభివృద్ధికి కృషి చేస్తా అన్నారు.

News December 14, 2025

శివాజీ నగర్‌‌ సర్పంచ్‌గా సుక్కినే నాగరాజు

image

జిల్లాలో రెండో విడత పంచాయతీ ఎన్నికలు ఫలితాలు వెలువడుతున్నాయి. దుగ్గొండి మండలం శివాజీ నగర్‌లో కాంగ్రెస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి సుక్కినే నాగరాజు 92 ఓట్లతో విజయం సాధించినట్లు అధికారులు తెలిపారు. దీంతో ఆయన అనుచరులు సంబరాలు జరుపుకొంటున్నారు.

News December 14, 2025

నాగర్‌కర్నూల్ జిల్లాలో తొలి సర్పంచ్ గెలుపు ఇక్కడే..!

image

బిజినేపల్లి మండలంలోని చిన్న పీర్‌ తాండా సర్పంచ్‌ ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతుదారు మునీందర్ నాయక్ విజయం సాధించారు. సమీప ప్రత్యర్థి నూర్యపై ఆయన 70 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. మండలంలోని 35 గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. మునీందర్ నాయక్ గెలుపు పట్ల తాండా గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు.