News February 16, 2025
సంగారెడ్డి: రేపటి నుంచి ప్రాక్టీస్ పేపర్-2 పరీక్షలు

జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రవేట్ పాఠశాల్లో పదో తరగతి చదువుతున్న విద్యార్థులకు రేపటి నుంచి 4 వరకు ప్రాక్టీస్ పేపర్-2 పరీక్షలను నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. డీఈవో మాట్లాడుతూ.. ప్రాక్టీస్ పేపర్లకు సంబంధించిన ప్రశ్నా పత్రాలను మండల వనరుల కేంద్రాల సంగారెడ్డిలో ఈ నెల నుంచి 10వ తరగతి ప్రాక్టీస్ పేపర్-2 పరీక్షలు నుంచి తీసుకోవాలని సూచించారు.
Similar News
News January 9, 2026
మల్యాల: బాధితుల పునరావాసానికి పూర్తి సహకారం: కలెక్టర్

మల్యాల మండలం కొండగట్టులో జరిగిన అగ్ని ప్రమాద ఘటనను తక్షణమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి జిల్లా నుంచి సమగ్ర నివేదిక సమర్పించామని జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ తెలిపారు. బాధిత కుటుంబాలు పూర్తిగా నష్టపోయిన నేపథ్యంలో ప్రభుత్వం వెంటనే స్పందించి ఆర్థిక సహాయం అందించిందన్నారు. ప్రభుత్వం అందించిన సహాయంతో అగ్ని ప్రమాదంలో సర్వం కోల్పోయిన వ్యాపారులు తిరిగి తమ జీవనోపాధిని ప్రారంభించాలని అన్నారు.
News January 9, 2026
జగిత్యాల: ఎస్సీ స్టడీ సర్కిల్‌లో ఐదు నెలల ఉచిత శిక్షణ

జగిత్యాల ఎస్సీ స్టడీ సర్కిల్‌లో ఐదు నెలల ఉచిత ఫౌండేషన్ కోర్సుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, వికలాంగ డిగ్రీ అభ్యర్థులు అర్హులు. ఆన్‌లైన్ దరఖాస్తులు tsstudycircle.co.inలో జనవరి 30 వరకు స్వీకరిస్తారు. ప్రవేశ పరీక్ష ఫిబ్రవరి 8న నిర్వహించి, ఎంపికైన 100 మందికి ఫిబ్రవరి 20 నుంచి జూలై 19 వరకు ఉచిత రెసిడెన్షియల్ కోచింగ్ అందించనున్నారు. వివరాలకు 9959264770కు కాల్ చేయవచ్చు.
News January 9, 2026
సచివాలయ సిబ్బందికి బయోమెట్రిక్ తప్పనిసరి: కలెక్టర్

గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది ప్రతిరోజూ బయోమెట్రిక్ హాజరు తప్పనిసరిగా వేయాలని కర్నూలు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి ఆదేశించారు. ఎంపీడీవోలు, సిబ్బందితో నిర్వహించిన టెలి కాన్ఫరెన్స్‌లో ఆమె మాట్లాడుతూ.. తక్కువ హాజరు శాతంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఫీల్డ్‌కు వెళ్లే ముందే సచివాలయంలో హాజరు నమోదు చేయాలని స్పష్టం చేశారు. హాజరు ఉన్న రోజులకు మాత్రమే వేతనాలు చెల్లిస్తామని కలెక్టర్ హెచ్చరించారు.


