News October 16, 2025
సంగారెడ్డి: ‘రేపటి నుంచి పాఠశాలలో స్వచ్ఛత పక్వాడ’

జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలో రేపటి నుంచి ఈనెల 31 వరకు స్వచ్ఛత పక్వాడ కార్యక్రమాలు నిర్వహించాలని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు గురువారం తెలిపారు. డీఈఓ మాట్లాడుతూ.. రోజు ఒక కార్యక్రమం నిర్వహించాలని దీనికి సంబంధించిన షెడ్యూల్‌ను పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ విడుదల చేశారని పేర్కొన్నారు. ఈ విషయాన్ని అందరూ ప్రధానోపాధ్యాయులు గమనించాలని సూచించారు.
Similar News
News October 17, 2025
HYD: IPS బ్యాచ్ పాసింగ్ పరేడ్‌కు BSF DG

HYDలోని SVP నేషనల్ పోలీస్ అకాడమీలో 77వ RR IPS బ్యాచ్ శిక్షణ పూర్తైంది. మొత్తం 190 మంది IPSలు, అందులో 65మంది మహిళలు (36%) ఉన్నారు. 50% మంది ఇంజినీరింగ్ నేపథ్యంతో అభ్యర్థులు ఉన్నారు. పరేడ్‌కు BSF DG దల్జిత్ సింగ్ చౌదరి ముఖ్య అతిథిగా హాజరై, ప్రతిభావంతులైన ట్రైనీలకు అవార్డులు అందజేయానున్నారు. 49 వారాల పాటు కఠిన శిక్షణ పూర్తిచేసిన అధికారులు త్వరలో బాధ్యతలు చేపడతారు.
News October 17, 2025
NLG: వీళ్లు మారడం లేదు.. అనుమతుల్లో చేతివాటం!

జిల్లాలో బాణాసంచా దుకాణాల పర్మిషన్ల కోసం అగ్నిమాపక శాఖ అధికారులు చేతివాటం ప్రదర్శిస్తున్నారు. ఒక్కో షాపునకు రూ.5 నుంచి రూ.8 వేలు డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. జిల్లాలో అన్ని ప్రాంతాల్లోనూ ఇవే ఇబ్బందులు ఎదురవుతున్నాయని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా టపాకాయల దుకాణం లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకున్న వ్యక్తి నుంచి లంచం తీసుకుంటూ అగ్నిమాపక శాఖ అధికారి ఏసీబీకి చిక్కిన విషయం తెలిసిందే.
News October 17, 2025
జనగామ: ప్రదక్షిణలతో వేసారి.. పరిష్కరించే వారేరి?

ప్రజావాణి కార్యక్రమంపై ప్రజల్లో ఆశలు సన్నగిల్లుతున్నాయి. ఒకప్పుడు సమస్య ఏదైనా జిల్లా అధికారులందరి సమక్షంలో జరిగే ప్రజావాణి వేదికలో సత్వర పరిష్కార మార్గాలు జరిగేవి. ప్రతి సోమవారం కలెక్టరేట్లో జరిగే ప్రజావాణిలో దరఖాస్తులు అందించి నెలలు, ఏళ్లు గడుస్తున్నా పరిష్కారానికి నోచుకోవడం లేదు. దీంతో వందల సంఖ్యలో దరఖాస్తులు పేరుకుపోతున్నాయి. ప్రజా’వాణి’ వినేవారు కరవయ్యారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.