News January 26, 2025

సంగారెడ్డి: రేపటి నుంచే 10వ తరగతి ప్రాక్టీస్ పేపర్-1 పరీక్షలు

image

జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలో పదో తరగతి చదువుతున్న విద్యార్థులకు రేపటి నుంచి ఫిబ్రవరి 4 వరకు ప్రాక్టీస్ పేపర్-1 పరీక్షలను నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. డీఈవో మాట్లాడుతూ.. ప్రాక్టీస్ పేపర్లకు సంబంధించిన ప్రశ్నా పత్రాలను మండల వనరుల కేంద్రాల నుంచి తీసుకోవాలని సూచించారు.

Similar News

News July 6, 2025

విశాఖలో భక్తి శ్రద్ధలతో మొహరం

image

విశాఖలో మొహరం వేడుకలకు ఆదివారం సాయంత్రం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. చెంగలరావుపేటలోని హుసేని మసీదు ఆధ్వర్యంలో షియా ముస్లింలు హజరత్ ఇమామ్ హుస్సేన్ మరణానికి సానుభూతిగా రక్తం చిందించారు. ఈ కార్యక్రమంలో షియా ముస్లింలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఎటువంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.

News July 6, 2025

BJP, TDP, కాంగ్రెస్‌కు గుణపాఠం తప్పదు: BRS

image

TG: ప్రజాభవన్ వేదికగా గురుశిష్యులు భేటీ అయి ఏడాదైనా ఆస్తులు-అప్పుల సమస్యలు తీరలేదని BRS ఆరోపించింది. వీరిద్దరి ఫెవికాల్ బంధం తెలంగాణ రైతుల గొంతు కోస్తోందని మండిపడింది. ‘వీరిద్దరి కుట్రలను తెలంగాణ సమాజం ఎప్పుడో పసిగట్టింది. గోదావరి జలాలను పక్క రాష్ట్రానికి దోచిపెడుతున్న రేవంత్‌ను ప్రజలు క్షమించరు. BJP, TDP, కాంగ్రెస్ మూకుమ్మడి కుట్రలకు ప్రజాక్షేత్రంలో గుణపాఠం తప్పదు’ అని ఎక్స్‌లో ట్వీట్ చేసింది.

News July 6, 2025

కోరుట్ల: పూర్తైన చిన్నారి హితిక్ష అంత్యక్రియలు

image

చిన్నారి హితిక్ష మృతదేహాన్ని వారి తల్లిదండ్రులు స్మశానానికి తీసుకెళ్లుతున్న సన్నివేశాన్ని చూసి అక్కడి స్థానికులు చలించిపోయారు. నిన్నటివరకు తమ పిల్లలతో కలివిడిగా సంతోషంగా ఆడుతూ తిరిగే చిన్నారి ఈరోజు ఇలా చలనం లేకుండా ఉండటం చూసి తీవ్ర దిగ్బ్రాంతికి గురయ్యారు. అభం శుభం తెలియని చిన్నారిని దారుణంగా హత్య చేసిన ఆ హంతకులను కఠినంగా శిక్షించాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు.