News February 3, 2025
సంగారెడ్డి: రేపటి పరీక్ష ఈ నెల 10కి వాయిదా
సంగారెడ్డిలోని సైన్స్ మ్యూజియంలో మంగళవారం నిర్వహించనున్న భౌతిక రసాయన శాస్త్ర ప్రతిభ పరీక్ష ఈ నెల 10న నిర్వహించనున్నట్లు జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. మండల స్థాయిలో గెలుపొందిన విద్యార్థులు ఈ విషయాన్ని గమనించాలన్నారు.
Similar News
News February 3, 2025
రాహుల్ వ్యాఖ్యలు అవాస్తవం: జయశంకర్
లోక్‌సభలో రాహుల్ చేసిన వ్యాఖ్యలు దేశ ప్రతిష్ఠను దెబ్బతీసేలా ఉన్నాయని విదేశాంగమంత్రి జయశంకర్ ఫైరయ్యారు. ట్రంప్ ప్రమాణ స్వీకారానికి ప్రధానిని ఆహ్వానించామని కోరడానికి తాను అమెరికాకు వెళ్లాననడం పూర్తిగా అబద్ధం అన్నారు. విదేశాంగ కార్యదర్శిని కలవటానికే అక్కడికి వెళ్లానని స్పష్టం చేశారు. ఎంతో ప్రతిష్ఠ కలిగిన మోదీ లాంటి నాయకుడిపై ఇలాంటి చౌకబారు వ్యాఖ్యలు చేయటం సరికాదని తన X ఖాతాలో పోస్ట్ చేశారు.
News February 3, 2025
కుక్కునూరు: రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి
బైక్ ను ట్రాక్టర్ ఢీకొన్న ఘటనలో ఒక వ్యక్తి మృతి చెందగా మరో వ్యక్తి గాయపడిన కుక్కునూరు మండలం నెమలి పేట గ్రామంలో జరిగింది. అల్లూరి సీతారామరాజు జిల్లా ఎటపాక మండలం చింతలగూడెం గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు బైక్ పై వేలేరుపాడు వెళ్తుండగా ఎదురుగా వస్తున్న ట్రాక్టర్ ఢీ కొనడంతో ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. వీరిని అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలిస్తుండగా ఐతంరాజుల శ్రీనివాస్ మృతి చెందాడు.
News February 3, 2025
తీన్మార్ మల్లన్నపై కాంగ్రెస్ ఎమ్మెల్యే ఫైర్
TG: ఎమ్మెల్సీ నవీన్ కుమార్(<<15344708>>తీన్మార్ మల్లన్న<<>>)పై భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి ఫైరయ్యారు. మల్లన్న స్థాయి మరిచి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. డబ్బులు ఖర్చు పెట్టి నల్గొండలో ఆయనను గెలిపించినట్లు తెలిపారు. ఓ వర్గాన్ని టార్గెట్ చేసి ఆయన మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. పార్టీ ఆయనపై చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు.