News October 21, 2025
సంగారెడ్డి: రేపు ఉపాధ్యాయులకు శిక్షణ: డీఈఓ

జిల్లాలోని నారాయణఖేడ్, జహీరాబాద్ డివిజన్లలోనీ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఇంగ్లిష్, సోషల్ బోధిస్తున్న ఉపాధ్యాయులకు డిజిటల్ లెర్నింగ్ పైన శిక్షణ నిర్వహించనున్నట్లు జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. డీఈఓ మాట్లాడుతూ.. సూచించిన కేంద్రాలలో శిక్షణకు ఉపాధ్యాయులు విధిగా హాజరు కావాలని సూచించారు.
Similar News
News October 21, 2025
కౌజు పిట్టల యూనిట్‌ను సందర్శించిన కలెక్టర్

సమీకృత వ్యవసాయం ద్వారా రైతుల ఆర్థికాభివృద్ధి సాధ్యమవుతుందని కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అన్నారు. మంగళవారం ములకలపల్లి మండలంలోని రాజుపేటలో నిర్వహిస్తున్న కౌజు పిట్టల యూనిట్‌ను ఆయన పరిశీలించారు. మండల సమైక్య సహాయంతో రుణం పొందిన రైతు 300 కౌజు పిట్టల పెంపకంతో పాటు నాటు కోళ్లు, మేకల పెంపకం చేపడుతూ నెలకు రూ.15 వేల ఆదాయం పొందుతున్నట్టు వివరించారు.
News October 21, 2025
‘రిజర్వేషన్ అమలులో మహా మోసం’

రిజర్వేషన్ల అమలులో ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు మహా మోసం జరిగిందని రిజర్వేషన్ సాధికార సమితి అధ్యక్షుడు జీవీ ఉజ్వల్ ఆరోపించారు. అనంతపురంలో బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. డీఎస్సీ నియామకాలలో రిజర్వేషన్ కటాఫ్ కంటే ఓపెన్ కటాఫ్ తక్కువ ఉండటం విడ్డూరంగా ఉందన్నారు. జీవో 77లో ఓపెన్ క్యాటగిరీ పోస్టులు నింపిన తర్వాతే రిజర్వేషన్ పోస్టులు భర్తీ చేయాలనే నిబంధన స్పష్టంగా ఉందన్నారు.
News October 21, 2025
లక్ష్మీనాయుడు హత్యపై ప్రత్యేక ట్రిబ్యునల్‌తో విచారణ

AP: కందుకూరులో లక్ష్మీనాయుడు హత్య కేసులో ప్రత్యేక ట్రిబ్యునల్‌తో దర్యాప్తు వేగవంతం చేయాలని CM CBN ఆదేశించారు. ‘మృతుని భార్యకు, పిల్లలకు రెండేసి ఎకరాలు, ₹5 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలి. పిల్లల చదువు బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది. గాయపడ్డ పవన్‌కు 4 ఎకరాలు, ₹5 లక్షలు, భార్గవ్‌కు ₹3లక్షలు, ఆసుపత్రి ఖర్చు చెల్లించాలి’ అని సూచించారు. విచారణ వేగంగా జరిగేలా FAST TRACK కోర్టుకు అప్పగించాలన్నారు.