News November 22, 2025
సంగారెడ్డి: రేపు ఎన్ఎంఎంఎస్ పరీక్ష

నేషనల్ మీన్స్ కం మెరిట్ స్కాలర్ షిప్(NMMS) పరీక్ష ఆదివారం ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు జరుగుతుందని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు శనివారం తెలిపారు. 8 పరీక్ష కేంద్రాల్లో 1380 మంది విద్యార్థులు పరీక్ష రాస్తున్నారని చెప్పారు. పరీక్ష నిర్వహణ కోసం 8 మంది చొప్పున చీఫ్ సూపరింటెండ్లు, డిపార్ట్మెంట్ ఆఫీసర్లను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.
Similar News
News November 22, 2025
వెయిట్ లిఫ్టర్లను అభినందించిన కలెక్టర్

ఈ నెల 14 నుంచి 16 వరకు విజయనగరం జిల్లాలో నిర్వహించిన 12వ రాష్ట్రస్థాయి సబ్ జూనియర్, సీనియర్ ఉమెన్, మెన్ వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో కర్నూలు లిఫ్టర్లు పతకాలు సాధించారు. వెయిట్ లిఫ్టర్లు వీరేశ్, ముషరాఫ్, పర్వేజ్, చాంద్ బాషా, హజరత్ వలిని కలెక్టర్ డా.సిరి శనివారం అభినందించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. జాతీయ స్థాయి వెయిట్ పోటీల్లోనూ ఇదే ప్రతిభ కనబరచాలన్నారు. కోచ్ యూసుఫ్ పాల్గొన్నారు.
News November 22, 2025
బీసీలను ప్రభుత్వం నట్టేట ముంచింది: R.కృష్ణయ్య

TG: BCలకు 42% రిజర్వేషన్లు ఇస్తామని నమ్మించి చివరికి ప్రభుత్వం నట్టేట ముంచిందని ఎంపీ R.కృష్ణయ్య మండిపడ్డారు. రిజర్వేషన్లపై సర్కార్ ఇవాళ జారీ చేసిన జీవో 46ను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు సూచించినట్లుగా ప్రస్తుత సామాజిక-రాజకీయ పరిస్థితులను అధ్యయనం చేయకుండా, గదుల్లో కూర్చొని నివేదికలు సిద్ధం చేయడం బీసీలను రాజకీయంగా దెబ్బతీయడమేనని వ్యాఖ్యానించారు.
News November 22, 2025
UPDATE: MBNR: పీయూ.. పలు కోర్సుల ఫలితాలు

పాలమూరు వర్సిటీలోని పరిపాలన భవనములో బి.ఎడ్,ఎం ఫార్మసీ,బిపిఎడ్,ఎం ఫార్మసీ, LLB ఫలితాలను వర్సిటీ వీసీ ప్రొఫెసర్ GN శ్రీనివాస్ విడుదల చేశారు.
✒బి.ఎడ్ 2వ సెమిస్టర్-71.98%
✒బి.ఎడ్ 4వ సెమిస్టర్- 93.48%
✒LLB 2వ సెమిస్టర్-68.85%
✒LLB 4వ సెమిస్టర్- 86.81%
✒బి.ఫార్మసీ 4వ సెమిస్టర్-60.40%
✒బీఫార్మసీ 6వ సెమిస్టర్-57.77%
✒ఎం.ఫార్మసీ 2వ సెమిస్టర్-72.22%
✒బిపిఎడ్ 2వ సెమిస్టర్-87.13%


