News October 20, 2025

సంగారెడ్డి: రేపు ఫ్లాగ్ డే కార్యక్రమం

image

పోలీసు అమరవీరుల దినోత్సవం సందర్భంగా మంగళవారం పోలీస్ పరిధి మైదానంలో ఫ్లాగ్ డే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఎస్పీ పారితోష్ పంకజ్ సోమవారం తెలిపారు. ఉదయం 8:30 నిమిషాలకు పోలీస్ అమరవీరులకు నివాళి అర్పిస్తామని చెప్పారు. కలెక్టర్ ప్రావీణ్య హాజరవుతారని పేర్కొన్నారు. పోలీసు అధికారులు సమయానికి హాజరు కావాలని సూచించారు.

Similar News

News October 20, 2025

NZB: రియాజ్ మృతిపై ప్రమోద్ కుటుంబం హర్షం

image

నిజామాబాద్ జిల్లాలోని కానిస్టేబుల్ ప్రమోద్ హత్య కేసు నిందితుడు రియాజ్ మృతి పట్ల ఆయన భార్య ప్రణీత భావోద్వేగానికి లోనై ఆనందం వ్యక్తం చేశారు. త్వరితగతిన స్పందించిన పోలీసు శాఖకు ధన్యవాదాలు తెలిపారు. ప్రమోద్ మృతికి న్యాయం జరిగిందని, రౌడీ షీటర్లను ఏరిపారేయాలని ఆమె కోరారు. ప్రమోద్ సోదరి మాధవి, గూపన్‌పల్లి గ్రామస్థులు సైతం పోలీసుల చర్యను హర్షించారు.

News October 20, 2025

కూతురిపై అత్యాచారానికి యత్నించాడని కొట్టిచంపిన తండ్రి!

image

తన కూతురిపై అత్యాచారానికి యత్నించిన కామాంధుడిని రాయితో కొట్టి చంపాడో తండ్రి. ఒడిశాలోని థెన్‌కనల్ జిల్లాలో జరిగిందీ ఘటన. కాలువలో స్నానం చేసేందుకు తండ్రితో కలిసి బాలిక (10) వెళ్లింది. స్నానం ముగించుకున్నాక పక్కకు వెళ్లిన సమయంలో కరుణాకర్ (27) అనే వ్యక్తి ఆమెపై లైంగిక దాడికి యత్నించాడు. బాలిక ఏడుపు విన్న తండ్రి వచ్చి బండరాయితో కొట్టి చంపాడు. తర్వాత స్థానిక పర్జంగ్ పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడు.

News October 20, 2025

కందుకూరు TDPలో ఓడలు బండ్లు.. బండ్లు ఓడలు..

image

కందుకూరు నియోజకవర్గ టీడీపీలో ‘ఓడలు బండ్లు.. బండ్లు ఓడలు ..’ అన్న సామెత ఆదివారం నిజమైంది. రెండు దశాబ్దాల పాటు TDPలో తిరుగులేని నాయకుడిగా చక్రం తిప్పిన మాజీ MLA డా.దివి శివరాంకు ఆదివారం దారకానిపాడులో కూర్చోడానికి కుర్చీ కూడా ఇవ్వలేదు. శివరాం అనుచరుడిగా, ఆయన పైరవీలతో పార్టీ ఇన్‌ఛార్జ్ అయి, ప్రస్తుతం MLAగా ఉన్న ఇంటూరి నాగేశ్వరావు కుర్చీలో కూర్చుంటే వెనుక వరుసలో శివరాం నిలబడాల్సి వచ్చింది.