News April 14, 2025

సంగారెడ్డి: రోడ్డు ప్రమాదం.. ఒకరి మృతి, ముగ్గురి పరిస్థితి విషమం

image

సంగారెడ్డి జిల్లా కొల్లూరు ఓఆర్ఆర్ పై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ముందు వెళ్తున్న వాహనాన్ని ఓవర్ టేక్ చేస్తుండగా టెంపో వాహనం అదుపుతప్పి డివైడర్, విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వాహన యజమాని మాదయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. బీదర్ నుంచి తిరుపతికి బేరం కుదుర్చుకుని వెళ్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదంలో మరో 12 మందికి తీవ్రగాయాలు కాగా, ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం.

Similar News

News October 31, 2025

సైదాపూర్: రైతులకు ఇబ్బందులు లేకుండా చూస్తాం: పొన్నం

image

సైదాపూర్ మండలంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. వరదలకు కొట్టుకుపోయిన రోడ్లు, నష్టపోయిన పంటలను మొత్తం రికార్డ్ చేయాలని అధికారులను ఆదేశించామని, ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసేలా అధికారులకు ఆదేశించారు. రైతులకు ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. మంత్రి వెంట కలెక్టర్ పమేలా సత్పతి, సిపి గౌస్ అలం ఉన్నారు.

News October 31, 2025

జనగామ జిల్లాలో నేటి టాప్ న్యూస్!

image

> జిల్లా వ్యాప్తంగా ఉప్పొంగిన వాగులు, వంకలు
> పలు చోట్ల నిలిచిపోయిన రాకపోకలు
> మాధారంలో 60 బస్తాల వరి ధాన్యం వరద పాలు
> జఫర్గడ్: వరద నీటిలో కొట్టుకుపోయి యువతి మృతి
> వెల్దండలో తెగిన రోడ్డు 80 గొర్రెలు గల్లంతు
> పాలకుర్తి: ఇంటిలోకి చేరిన వర్షపు నీరు
> దేవరుప్పుల: విద్యుత్ షాక్‌తో గేదె మృతి
> జనగామ డీపీవోగా నవీన్ బాధ్యతలు స్వీకరణ
> జిల్లాస్థాయి యువజన కళాకారుల ఎంపిక వాయిదా

News October 31, 2025

కొండాపూర్ కల్వర్టు మరమ్మతు పూర్తి చేయాలి: కలెక్టర్

image

కోనరావుపేట మండలంలోని కొండాపూర్ శివారులో పెంటివాగు ప్రవహించడంతో దెబ్బతిన్న లో లెవెల్ కల్వర్టును ఇన్‌చార్జి కలెక్టర్ గరిమా అగర్వాల్ గురువారం పరిశీలించారు. కల్వర్టుకు పక్కాగా మరమ్మతులు పూర్తి చేసి రాకపోకలు పునరుద్ధరించాలని ఆమె ఆర్ అండ్ బీ అధికారులను ఆదేశించారు. మరమ్మతులు వేగవంతం చేసి, ప్రజల ఇబ్బందులు తొలగించాలని కలెక్టర్ సూచించారు.