News February 2, 2025
సంగారెడ్డి: రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి
రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందిన ఘటన మేడ్చల్ PS పరిధిలో జరిగింది. వివరాలు.. సంగారెడ్డి జిల్లా గుమ్మడిదలకు చెందిన శంకర్ గుప్త, చిట్కూల్‌కు చెందిన సురేశ్ గుప్త కుటుంబ సమేతంగా శ్రీశైలం వెళ్లి స్వగ్రామానికి వస్తున్నారు. శనివారం అర్ధరాత్రి మేడ్చల్ PS పరిధిలో కంటెయినర్‌ను కారు ఢీకొంది. దీంతో డ్రైవర్ నర్సింహా(28), శంకర్ (46), సురేశ్(45) అక్కడికక్కడే మృతి చెందారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News February 2, 2025
వేములవాడ: పులి పుకార్లను నమ్మవద్దు: డీఎఫ్‌వో
పులి దొరికిందన్న పుకార్లను నమ్మవద్దని జిల్లా అటవీశాఖ అధికారి బాలమణి అన్నారు. మండలంలో పులి సంచారం ఉందన్న సమాచారం మేరకు నూకలమర్రి గ్రామ శివారులో పలు ప్రాంతాలను సిబ్బందితో కలిసి ఆమె శనివారం పరిశీలించారు. అనంతరం వేములవాడలోని అటవీశాఖ కార్యాలయంలో డీఎఫ్‌వో మాట్లాడుతూ.. పులి సంచారంపై గ్రామాల ప్రజలందరూ ఆందోళన చెందవద్దన్నారు. పొలాలకు వెళ్లే రైతులు అటవీశాఖ అధికారులు సూచనలను తప్పనిసరిగా పాటించాలన్నారు.
News February 2, 2025
తిరుపతిలో రెచ్చిపోయిన దొంగలు..1.48 కిలోల బంగారం చోరీ
తిరుచానూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ విల్లాలో భారీ దొంగతనం జరిగినట్లు పోలీసులు తెలిపారు. దొంగలు వరుసగా 4 ఇళ్లలో చేతివాటం ప్రదర్శించి దాదాపు 1.48 కిలో బంగారాన్ని ఎత్తుకెళ్లారు. విల్లాలోని 80, 81, 82, 83 ఇండ్లలో చోరీ జరిగినట్లు పోలీసులు గుర్తించారు. బాధితులు మేఘనాథ రెడ్డి ఇంట్లో 1 కేజీ బంగారం, కేశవ నాయుడు ఇంట్లో 48 గ్రాముల బంగారం చోరీకి గురైంది.
News February 2, 2025
పెద్దపల్లి జిల్లాలో ఉష్ణోగ్రతలు ఇలా..
పెద్దపల్లి జిల్లాలో రోజురోజుకు చలితీవ్రత తగ్గుముఖం పడుతుంది. గడచిన 24 గంటల్లో అత్యల్పంగా ఓదెల 17.3℃, మంథని 17.4, సుల్తానాబాద్ 17.4, రామగుండం 17.7, అంతర్గాం 18.1, పెద్దపల్లి 18.1, జూలపల్లి 18.6, కాల్వ శ్రీరాంపూర్ 18.6, పాలకుర్తి 18.8, ఎలిగేడు 18.8, కమాన్పూర్ 19.1, ధర్మారం 19.2, రామగిరి 20.3, ముత్తారంలో 21.8℃గా నమోదయింది.