News February 16, 2026

సంగారెడ్డి: రోడ్డు ప్రమాదంలో SIకి గాయాలు

image

చౌటకూరు మండలం సరాప్ పల్లి గ్రామ శివారులో పోలీసు వాహనాన్ని వెనక వచ్చిన లారీ ఢీ కొట్టింది. వాహనంలో ఉన్న జోగిపేట ఎస్ఐ పాండుకు గాయాలయ్యాయి. జోగిపేట నుంచి సంగారెడ్డికి వెళుతుండగా ఈ ఘటన జరిగింది. వెంటనే సంగారెడ్డిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. లారీ డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Similar News

News February 21, 2026

పాక్‌లో ‘డెత్ స్క్వాడ్’.. 8 నెలల్లో 924 మంది హతం!

image

పాకిస్థాన్‌లోని పంజాబ్‌లో నేర నియంత్రణ శాఖ(CCD) డెత్ స్క్వాడ్‌లా మారింది. 2025లో ఏర్పాటైన ఈ విభాగం ఏప్రిల్-డిసెంబర్ మధ్య ఏకంగా 670 ఎన్‌కౌంటర్లు చేసింది. పోలీసు కాల్పుల్లో 924 మంది చనిపోయారు. ఇద్దరు పోలీసులు చనిపోయారని రికార్డుల్లో పేర్కొన్నారు. పాక్ మానవ హక్కుల కమిషన్ ఈ వివరాలు వెల్లడించింది. 8 నెలల్లో సగటున రోజూ 2 కంటే ఎక్కువ ఎన్‌కౌంటర్లు నమోదయ్యాయని, ఒక్క లాహోర్‌లోనే 139 జరిగాయని చెప్పింది.

News February 21, 2026

పుట్టిన రోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.

News February 21, 2026

వెనక్కి తగ్గేది లేదు: ట్రంప్

image

తాను విధించిన టారిఫ్స్‌ను <<19195677>>రద్దు చేస్తూ<<>> సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మండిపడ్డారు. ఈ నిర్ణయం తీవ్ర నిరాశపరిచిందని, కొంత మంది న్యాయమూర్తులు విదేశీ ప్రయోజనాలకు ప్రభావితమయ్యారని ఆరోపించారు. కోర్టులోని కొంతమంది సభ్యులను చూసి సిగ్గుపడుతున్నానని ఫైరయ్యారు. వాణిజ్య ఎజెండా నుంచి వెనక్కి తగ్గేది లేదని, ఇంకా బలమైన పద్ధతులు తనకు తెలుసని హెచ్చరించారు.