News February 3, 2025
సంగారెడ్డి: రోడ్డు ప్రమాదంలో ఎమ్మెల్యే గన్‌మెన్ మృతి
రోడ్డు ప్రమాదంలో చేవెళ్ల ఎమ్మెల్యే గన్‌మెన్ మృతి చెందిన ఘటన పటాన్ చెరు మండలంలో జరిగింది. స్థానికుల వివరాలు.. రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి(M) బుల్కాపూర్‌కు చెందిన శ్రీనివాస్(34) పటాన్ చెరు(M) ఎలిమెలలో ఆదివారం బీరప్ప జాతరకు అమ్మమ్మ ఇంటికి వచ్చాడు. జాతర ముగించుకుని వస్తుండగా కొండకల్ సమీపంలో గుర్తు తెలియని వాహనం ఢీకొని అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Similar News
News February 3, 2025
గన్ మెన్ నాగరాజుకు అభినందించిన బాపట్ల కలెక్టర్
బాపట్ల జిల్లా పోలీస్ స్పోర్ట్స్ మీట్‌లో ప్రతిభ కనబరిచిన గన్ మెన్ నాగరాజును జిల్లా కలెక్టర్ వెంకట మురళి అభినందించారు. జిల్లా పోలీస్ గ్రౌండ్‌లో జరిగిన జిల్లా స్పోర్ట్స్ మీట్ అథ్లెటిక్స్‌లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన నాగరాజును సోమవారం జిల్లా కలెక్టర్ వెంకట మురళి అభినందించారు. కాగా నాగరాజు 4 బంగారు పతకాలు, ఒక సిల్వర్ పతకాన్ని గెలుపొందారు.
News February 3, 2025
ఆజామ్ జాహి మిల్లుపై మావోయిస్టు పార్టీ లేఖ
వరంగల్ ఆజామ్ జాహి మిల్లు వస్త్ర పరిశ్రమకు చెందిన భూములపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) జేఎండబ్ల్యూపీ డివిజన్ కమిటీ వెంకటేశ్ పేరుతో ములుగు జిల్లాలో లేఖ కలకలం సృష్టిస్తోంది. భూములపై పూర్తి హక్కు కార్మికులకు, వారి కుటుంబాలకు దక్కే వరకు పోరాటాలు చేపట్టాలని లేఖలో పేర్కొన్నారు. 2002లో 451 మంది కార్మికులకు బలవంతంగా వీఆర్ఎస్ ఇచ్చి మిల్లును మూసివేశారని తెలిపారు.