News September 13, 2025
సంగారెడ్డి: లోక్ అదాలత్‌లో 4,334 కేసులు పరిష్కారం

సంగారెడ్డి జిల్లాలో నిర్వహించిన లోక్ అదాలత్‌లో 4,334 కేసులు పరిష్కరించినట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి భవాని చంద్ర తెలిపారు. సంగారెడ్డి జిల్లా కోర్టులో శనివారం లోక్ అదాలత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. క్రిమినల్ కాంపౌండ్ 3,850, సివిల్ – 22, మోటార్ వాహన – 21, ఫ్రీ లిటిగేషన్ -40, బ్యాంకు రికవరీ- 58, సైబర్ క్రైమ్- 93, విద్యుత్ చౌర్యం- 238 కేసులు పరిష్కరించినట్లు చెప్పారు.
Similar News
News September 13, 2025
గాజువాక: స్పా ముసుగులో వ్యభిచారం

గాజువాకలో స్పా ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు సమాచారం రావడంతో టాస్క్‌ఫోర్స్ సీఐ అప్పలనాయుడు తన సిబ్బందితో దాడి చేశారు. చైతన్యనగర్‌లోని తాయ్ స్పా సెంటర్‌లో ఐదుగురు అమ్మాయిలతో పాటు ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకొని గాజువాక పోలీసులకు అప్పగించినట్లు ఆయన చెప్పారు. నగరంలో అసాంఘిక చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
News September 13, 2025
బాగా నమిలి తినండి: వైద్యులు

ఆహారాన్ని గబగబా తినొద్దని, అలా చేస్తే సరిగ్గా జీర్ణం కాదని వైద్యులు చెబుతున్నారు. ఎంత తక్కువ సమయంలో తినడం పూర్తి చేస్తే అంత ఎక్కువగా బరువు పెరిగే అవకాశం ఉంటుందని అంటున్నారు. వేగంగా, నమలకుండా తింటే సరిపడనంత తిన్నామనే భావన కలగదని.. అరగంట పాటు నెమ్మదిగా, బాగా నమిలి తినాలని సూచిస్తున్నారు. దీనివల్ల అది పూర్తిగా జీర్ణమై పోషకాలన్నీ శరీరానికి అందుతాయని, అలాగే దవడలకూ మేలు జరుగుతుందని వివరిస్తున్నారు.
News September 13, 2025
ఇండియా-పాక్ మ్యాచ్ బాయ్‌కాట్ చేయాలి: రాజా సింగ్

పాకిస్థాన్‌తో టీమ్ ఇండియా మ్యాచ్ ఆడొద్దని TG ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. ఆసియా కప్‌లో రేపు జరిగే మ్యాచ్‌ను బాయ్‌కాట్ చేయాలని పిలుపునిచ్చారు. పహల్గామ్ దాడి తర్వాత పాక్‌తో మ్యాచ్ సరికాదని అభిప్రాయపడ్డారు. దీనిపై నిర్ణయం తీసుకోవాలని బీసీసీఐకి విజ్ఞప్తి చేశారు. భారతీయులందరూ ఇదే డిమాండ్ చేస్తున్నారని తెలిపారు. అటు ఈ మ్యాచ్ చూసేందుకు ఆసక్తి చూపకపోవడంతో టికెట్ సేల్స్ కూడా అంతంతమాత్రంగానే ఉన్నాయి.