News October 29, 2025

సంగారెడ్డి: వరి కోతలను వాయిదా వేసుకోవాలి.. అధికారుల సూచన

image

తుఫాన్ ప్రభావంతో మూడు రోజులు వర్షం కురిసే అవకాశం ఉన్నందున సంగారెడ్డి జిల్లా రైతులు వరి కోతలను వాయిదా వేసుకోవాలని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు. ఐకేపీ, పీఏసీఎస్ కొనుగోలు కేంద్రాల్లో రైతులకు టార్పాలిన్లను అందుబాటులో ఉంచాలని సిబ్బందికి సూచించారు. అందువల్ల రైతులు వాతావరణం మెరుగు పడేవరకు వరి కోతలు వాయిదా వేసుకోవాలన్నారు.

Similar News

News October 30, 2025

NLG: యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి: మంత్రి

image

భారీ వర్షాల నేపథ్యంలో జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని.. ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆదేశించారు. పోలీస్, రెవెన్యూ, విద్యుత్, ఇరిగేషన్, R&B, పంచాయతీ రాజ్, వైద్య ఆరోగ్య శాఖల సమన్వయంతో పనిచేయాలని సూచించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని కలెక్టర్, ఎస్పీని మంత్రి ఆదేశించారు.

News October 30, 2025

మహిళ సూసైడ్ అటెంప్ట్

image

గుత్తి మండలం అబ్బేదొడ్డినికి చెందిన శిరీష పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. అపస్మారక స్థితిలో పడి ఉన్న ఆమెను కుటుంబ సభ్యులు వెంటనే గుత్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందించి, 48 గంటల పాటు అబ్జర్వేషన్‌లో ఉండాలని శిరీషకు సూచించారు.

News October 30, 2025

HYD: 1987 నాటి రైలు ఎలా ఉండేదో తెలుసా?

image

1987 నాటి ఈ అందమైన ఫొటో నాటి రైల్వే వ్యవస్థను గుర్తుచేస్తోంది. సికింద్రాబాద్ స్టేషన్‌కి అకోలా జంక్షన్‌ నుంచి వచ్చిన ప్రయాణికులను YP 2865 లోకోమోటివ్‌ రైలు పొగలు కక్కుతూ, కూ.. అంటూ కూతవేస్తూ లాగేది. 1960ల చివర్లో టాటా కంపెనీ టెల్కో, జంషెడ్‌పూర్‌లో ఈ YP ఇంజిన్‌ తయారు చేసిందని IRAS అనంత్ తెలిపారు. తను ఉద్యోగంలో చేరిన సమయంలో రైల్వే అనుభూతులను గుర్తు చేసుకున్నారు.