News August 24, 2025

సంగారెడ్డి: వసతి గృహలకు రూ.3.30 కోట్లు

image

సంగారెడ్డి జిల్లాలోని సాంఘిక సంక్షేమ వసతి గృహ మరమ్మతులకు రూ.3.30 కోట్ల నిధులు మంజూరు అయినట్లు జిల్లా ఎస్సీ అభివృద్ధి అధికారి అఖిలేష్ రెడ్డి ఆదివారం తెలిపారు. 33 వసతి గృహాలకు నిధులు కేటాయించినట్లు చెప్పారు. ఒక్కో వసతి గృహానికి రూ.10 లక్షల చొప్పున మంజూరైనట్లు పేర్కొన్నారు. సివిల్ వర్క్, ఎలక్ట్రికల్, ప్రహరీ గోడలు, బాత్రూం, టాయిలెట్ రిపేరింగ్, పెయింటింగ్ వంటివి చేయిస్తామని వివరించారు.

Similar News

News August 24, 2025

VKB: యూరియా కోసం రైతుల బారులు

image

వికారాబాద్ జిల్లా కేంద్రంలోని వేంకటేశ్వర స్వామి ఆలయం వద్ద యూరియా కోసం రైతులు భారీగా బారులు తీరారు. ఉదయం నుంచే రోడ్డుపై క్యూ కట్టారు. వికారాబాద్‌తో పాటు మర్పల్లి, ధారూర్, మోమిన్‌పేట వంటి పరిసర మండలాల్లో యూరియా కొరత ఉందని రైతులు తెలిపారు. అధికారులు స్పందించి, యూరియా కొరత లేకుండా చూడాలని కోరారు.

News August 24, 2025

WGL: పాక్స్ డైరెక్టర్ ఇంట్లో యూరియా బస్తాలు లభ్యం

image

రాయపర్తి మండలం తిర్మలాయపల్లిలో PACS డైరెక్టర్ దొంతరబోయిన యాదగిరి ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన 26 యూరియా బస్తాలను వ్యవసాయ అధికారులు సీజ్ చేశారు. రాయపర్తి ఏవో వీరభద్రం ఆధ్వర్యంలో నమ్మదగిన సమాచారంతో తనిఖీలు చేయగా బస్తాలు లభించాయి. యాదగిరిపై బీఎన్ఎస్ 6ఏ కింద కేసు నమోదు చేశారు. యూరియా కొరతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న వేళ డైరెక్టర్ ఇంట్లో అక్రమ నిల్వలు కలకలం సృష్టించాయి.

News August 24, 2025

కర్నూలు: కవల పిల్లలకు టీచర్ ఉద్యోగాలు

image

గూడూరుకు చెందిన వడ్ల రామాంజనేయులు, సరస్వతి దంపతుల కుమారులు(కవలలు) రవితేజ ఆచారి, విష్ణు వర్ధన ఆచారి డీఎస్సీలో ఉత్తీర్ణులై టీచర్ ఉద్యోగాలు పొందారు. రవితేజ ఆచారి 83 మార్కులు, విష్ణు వర్ధన ఆచారి 82 మార్కులు సాధించారు. తమ కుమారులు ఎస్జీటీ విభాగంలో ఉద్యోగాలు సాధించారని తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు. పలువురు వారిని అభినందించారు.