News December 30, 2025
సంగారెడ్డి: వాటర్ ట్యాంక్‌లో బాలుడు పడి మృతి

వాటర్ ట్యాంకులో ప్రమాదవశాత్తు ఓ బాలుడు పడి మృతిచెందిన ఘటన సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలం సర్దార్ తండాలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. తండాకు చెందిన రకియా సంతోష్ దంపతుల ఐదేళ్ల బాలుడు శ్యాంసుందర్ సోమవారం సాయంత్రం బడి వదలగానే ఆడుకుంటూ పక్కనే ఉన్న వాటర్ ట్యాంక్ వైపు వెళ్లి, పైకి ఎక్కాడు. ప్రమాదవశాత్తు ట్యాంకులో పడి మృతిచెందాడు. ఈ ఘటన తండాలో విషాదం నింపింది. తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి.
Similar News
News February 17, 2026
జీ.మాడుగుల: రోడ్డు ప్రమాదం.. లారీ డ్రైవర్ మృతి

జీ.మాడుగుల మండలం వంజరి పంచాయతీ ములకాయపుట్టు వద్ద గల జాతీయ రహదారిపై మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందారు. హైవే పనులు నిమిత్తం వచ్చిన ట్రాలీ లారీ అదుపు తప్పి ప్రమాదానికి గురయ్యింది. ఈ ఘటనలో లారీ డ్రైవర్ చనిపోయాడని స్థానికులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News February 17, 2026
సర్వే 2026 రికార్డుల్లో నిగూఢ నినిదాలు.. బఫర్ జోన్ మార్కింగ్‌లో మెలిక!

హైదర్షాకోట్-అత్తాపూర్ వరకు ఎర్ర గీతల వెనుక ఉన్న ‘టెక్నికల్’ చిక్కుముడి. మున్సిపల్ శాఖ జారీ చేసిన తాజా ఇంటర్నల్ సర్క్యులర్ ప్రకారం.. మూసీ గరిష్ట వరద మట్టం గుర్తింపులో కొత్త సాఫ్ట్‌వేర్ వాడుతున్నారని తెలిసింది. ఇక్కడే చట్టపరమైన చిక్కుముడి ఉంది. దశాబ్దాల క్రితం ఉన్న రెవెన్యూ మ్యాపులకు ఇప్పటి గూగుల్ శాటిలైట్ మ్యాపులకు పొంతన కుదరడం లేదు. వందలాది ‘లీగల్’ ప్రాపర్టీలు కూడా బఫర్ జోన్‌లోకి వస్తున్నాయి.
News February 17, 2026
GNT: తపాలా శాఖపై పెమ్మసాని సమీక్ష

గుంటూరు ఎంపీ, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తపాలా శాఖ పనితీరుపై సమీక్ష నిర్వహించారు. తెలంగాణ, ఏపీ సహా పలు సర్కిళ్ల పనితీరును పరిశీలించారు. తెలంగాణ సర్కిల్ ఉత్తమ ఫలితాలు సాధించిందని ప్రత్యేకంగా ప్రశంసించారు. మిగిలిన సర్కిళ్లు ‘టెక్-ఫస్ట్’ విధానాన్ని పాటించాలని సూచించారు. వినియోగదారుల సంతృప్తే లక్ష్యంగా పనిచేయాలన్నారు. పారదర్శకత, ఆర్థిక క్రమశిక్షణతో సేవలను వేగవంతం చేయాలని ఆదేశించారు.


