News February 24, 2025
సంగారెడ్డి: వారణాసి వద్ద రోడ్డు ప్రమాదం ముగ్గురు మృతి

వారణాసి వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో సంగారెడ్డి జిల్లా వాసులు ముగ్గురు మృతి చెందారు. కుంభమేళాకు వెళ్లి వస్తుండగా వారణాసి వద్ద టిప్పర్‌ను కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో జహీరాబాద్ ఇరిగేషన్ డీఈ వెంకటరామిరెడ్డి(46), ఆయన భార్య విలాసిని (40), న్యాల్ కల్ మండలం మల్గికి చెందిన కారు డ్రైవర్ మల్లారెడ్డి అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News December 13, 2025
MLAల చేతుల్లో MRO ఆఫీసులు: ధర్మాన

AP: భూ సమస్యలు తీరక సామాన్యులు బాధపడుతున్నారని మాజీమంత్రి ధర్మాన ప్రసాదరావు ఆరోపించారు. ‘5 సెంటీమీటర్ల తేడా కూడా లేకుండా కొలతలు చేయగల టెక్నాలజీతో భూ సర్వే జరుపుతుంటే, సర్టిఫికెట్‌పై జగన్ బొమ్ముందని, భూములు ఆయన తీసుకుంటారని చంద్రబాబు మాయ మాటలు చెప్పారు. ఇన్నేళ్ల అనుభవం ఉన్న చంద్రబాబు ఒక్క భూ సంస్కరణ అయినా తెచ్చారా? నేడు ఎమ్మార్వో కార్యాలయాలన్నీ ఎమ్మెల్యేల చేతుల్లోకి వెళ్లిపోయాయి’ అని విమర్శించారు.
News December 13, 2025
బి.కొత్తకోట: జిల్లా స్థాయి పోటీలకు ఎంపికైంది వీరే.!

పొట్టి శ్రీరాములు జయంతిని పురస్కరించుకొని శనివారం బి.కొత్తకోట బాలికల హైస్కూల్లో మండల స్థాయి వ్యాసరచన, వకృత్వ, క్విజ్ పోటీలు జరిపారు. మండలంలోని అన్ని ఉన్నత పాఠశాలల నుంచి విద్యార్థులు హాజరయ్యారు. వ్యాసరచన పోటీల్లో మానస, వకృత్వ పోటీల్లో నవదీప్ రెడ్డి, క్విజ్ పోటీల్లో నవదీప్ రెడ్డి సత్తా చాటారని MEOలు రెడ్డిశేఖర్, భీమేశ్వరాచారి తెలిపారు. వీరు రాయచోటిలో జరిగే జిల్లాస్థాయి పోటీల్లో పాల్గొటారన్నారు.
News December 13, 2025
తొండూరులో 9 మంది విద్యార్థులకు అస్వస్థత

తొండూరు మండలంలోని యాదవారిపల్లె ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో శనివారం మధ్యాహ్నం భోజనం తిన్న 9 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. విద్యార్థులకు విరేచనాలు అవుతుండడంతో తొండూరు 108 వాహనంలో చికిత్స నిమిత్తం పులివెందుల హాస్పిటల్‌కు తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


