News October 7, 2025
సంగారెడ్డి: వాల్మీకి ఇచ్చే నిజమైన నివాళి అదే: SP

వాల్మీకి జయంతి సందర్భంగా సంగారెడ్డి జిల్లా పోలీసు కార్యాలయంలో ఆయన చిత్రపటానికి అశోక్ మంగళవారం పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎస్పీ పరితోష్ పంకజ్ మాట్లాడుతూ.. వాల్మీకి రచించిన రామాయణం సత్యం, అహింసను బోధిస్తుందని పేర్కొన్నారు. వాల్మీకి మార్గంలో నడవడమే ఆయనకు ఇచ్చే నిజమైన నివాళి అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ రఘునందన్ రావు పాల్గొన్నారు.
Similar News
News October 7, 2025
హైదరాబాద్‌లో భారీ వర్షం

మహానగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. నాంపల్లి, అబిడ్స్, హిమాయత్‌నగర్, బర్కత్‌పురా, నల్లకుంట, కోఠి, కాచిగూడ ప్రాంతాల్లో భారీ వాన పడుతోంది. అటు యాదాద్రి, కరీంనగర్, ఖమ్మం, కామారెడ్డి, MBNR, మెదక్, మేడ్చల్, నల్గొండ, నిజామాబాద్, RR, సిద్దిపేట, సంగారెడ్డి, సూర్యాపేట జిల్లాల్లోనూ రానున్న 2 గంటల్లో వర్షం కురిసే ఛాన్స్ ఉందని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. మీ ఏరియాలో వాన పడుతోందా?
News October 7, 2025
బిహార్ ఎలక్షన్స్.. బీజేపీ, జేడీయూకి సమాన సీట్లు!

బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మిత్రపక్షాలు బీజేపీ, జేడీయూ మధ్య సీట్ల కసరత్తు జరుగుతోంది. మొత్తం 243 సీట్లలో 205 చోట్ల ఇరు పార్టీలు సమాన స్థానాల్లో బరిలో దిగాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. మిగిలిన 38 సీట్లు NDAలోని LJP, HAM, RLMలకు ఖరారయ్యే అవకాశం ఉంది. గత అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీజేపీ, జేడీయూ కలిసి పోటీ చేసి అధికారం చేపట్టాయి. ఇక బిహార్ ఎన్నికలు NOV 6, 11న జరగనుండగా 14న ఫలితాలు వెలువడతాయి.
News October 7, 2025
కోదాడ: రూ.60 లక్షల గంజాయి స్వాధీనం

కోదాడ పోలీస్ స్టేషన్ పరిధిలో రూ.60 లక్షల విలువైన క్వింటా 20 కేజీల గంజాయిని కోదాడ సీసీఎస్ పోలీసులు పట్టుకుని సీజ్ చేశారు. ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. వారిని సూర్యాపేట జిల్లా పోలీస్ కార్యాలయంలో మీడియా ఎదుట ప్రవేశపెట్టారు. గంజాయి రవాణా, సరఫరా, అమ్మకం, వినియోగం నేరమని, NDPS చట్టాల ప్రకారం కఠిన చర్యలు తప్పవని ఎస్పీ నరసింహ హెచ్చరించారు.