News September 10, 2025
సంగారెడ్డి: విద్యాభివృద్ధికి టీఎల్‌ఎం మేళా దోహదం: ఎఎంఓ

టీఎల్‌ఎం మేళా విద్యాభివృద్ధికి ఎంతో దోహదపడుతుందని జిల్లా ఎఎంఓ బాలయ్య పేర్కొన్నారు. బుధవారం సంగారెడ్డి పట్టణంలోని రావ్స్ పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి టీఎల్‌ఎం మేళాను ఎఎంఓ ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఉపాధ్యాయులు విద్యా బోధన మరింత మెరుగుపరచుకునేందుకు పిల్లల్లో చదువుపై ఆసక్తిని పెంపొందించేందుకు టీఎల్‌ఎం ఉపయోగ పడుతుందని అన్నారు.
Similar News
News September 11, 2025
గ్రేటర్ HYD వ్యాప్తంగా వర్షపాతం వివరాలు..!

గ్రేటర్ హైదరాబాద్‌లో పలుచోట్ల ఒక్కసారిగా వర్షం కురిసింది. హస్తినాపురంలో 25 మిల్లీమీటర్లు, బండ్లగూడలో 19.3, చంపాపేటలో 12.3, గన్ ఫౌండ్రీలో 7.8, బంజారాహిల్స్, ఉప్పల్‌లో 5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఒక్కసారిగా వర్షం కురవడంతో వాతావరణం చల్లబడింది. రాబోయే రెండు రోజులు చిరుజల్లులు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

చట్ట వ్యతిరేక శక్తులపై ఎస్పీ సీరియస్

పోలీసులపై దాడి చేసిన ఘటనను ఎస్పీ నరసింహ కిషోర్ సీరియస్‌గా తీసుకున్నారు. జిల్లాలో చట్ట వ్యతిరేక శక్తులను అరికట్టేందుకు 28 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. దాడి జరిగిన తర్వాత జిల్లాలో డ్రంక్ అండ్ డ్రైవ్, ఓపెన్ డ్రింకింగ్లపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. రికార్డులు సరిగా లేని 90 వాహనాలపై కేసులు నమోదు చేశారు. 23 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు, 110 ఓపెన్ డ్రింకింగ్ కేసులు నమోదయ్యాయి.