News February 19, 2025

సంగారెడ్డి: విద్యార్థిని అభినందించిన డీఈవో

image

జిల్లా కేంద్రంలోని జిల్లా సైన్స్ మ్యూజియంలో మంగళవారం నిర్వహించిన రాష్ట్ర స్థాయి భౌతికశాస్త్రం ప్రతిభ పరీక్ష పోటీలో న్యాల్కల్ మండలంలోని మిర్జాపూర్ పాఠశాలకు చెందిన సాదియ నౌశిన్ అనే విద్యార్థిని రాష్ట్ర స్థాయిలో 5వ స్థానంలో నిలిచింది. ఈ సందర్భంగా జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు, డీసీఈబి సెక్రటరీ లింబాజి, సైన్స్ అధికారి సిద్ధారెడ్డిలు అభినందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.

Similar News

News January 8, 2026

రైతులకు రుణాలు మంజూరయ్యేలా చూడాలి: కలెక్టర్

image

రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని రుణాలు మంజూరయ్యేలా చూడాలని కలెక్టర్ రాజాబాబు బ్యాంకు అధికారులను ఆదేశించారు. ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయంలో జిల్లా స్థాయి సాంకేతిక కమిటీ సమావేశాన్ని ఆయన గురువారం నిర్వహించి మాట్లాడారు. జిల్లాలో ఉద్యాన పంటల విస్తీర్ణాన్ని పెంచేలా సహకార బ్యాంకులు రైతులకు సరైన సమయంలో రుణాలు అందించాలన్నారు.

News January 8, 2026

జనగామలో విద్యాశాఖపై జిల్లా స్థాయి సమావేశం

image

జనగామ ఐడీఓసీ సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్, జిల్లా విద్యా శాఖ అధికారి పింకేష్ కుమార్, హైదరాబాద్ SIET జాయింట్ డైరెక్టర్ ఎస్.విజయలక్ష్మి ఆధ్వర్యంలో విద్యాశాఖ జిల్లా స్థాయి సమావేశంతో పాటు పీఎం శ్రీ పాఠశాలల నిధుల వినియోగంపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. గత నెలతో పోలిస్తే జిల్లా పురోగతి సాధించిందన్నారు. కానీ ఇంకా ముందుకు సాగాలని సూచించారు.

News January 8, 2026

ప్రభుత్వ స్కూళ్లలో బ్రేక్ ఫాస్ట్.. సీఎం సమీక్ష

image

TG: సెంట్రలైజ్డ్ కిచెన్స్ ద్వారా ప్రభుత్వ స్కూళ్లలో నాణ్యమైన బ్రేక్ ఫాస్ట్, లంచ్ అందించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను CM రేవంత్ ఆదేశించారు. ప్రతి రెండు నియోజకవర్గాలకు ఒక సెంట్రలైజ్డ్ కిచెన్ ఏర్పాటు చేయాలని రివ్యూ మీటింగ్‌లో సూచించారు. ‘సోలార్ కిచెన్‌ల ఏర్పాటును పరిశీలించాలి. యంగ్ ఇండియా స్కూళ్ల పనుల్ని వేగవంతం చేయాలి. ఇందుకు అనుగుణంగా బడ్జెట్ కేటాయింపుల్లో ప్రాధాన్యతనివ్వాలి’ అని చెప్పారు.