News February 23, 2025
సంగారెడ్డి: విద్యార్థులతో వంటలు చేయించిన ఉపాధ్యాయుల సస్పెన్షన్

కంగ్టి ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్ వసతి గృహంలో విద్యార్థులతో వంటలు చేయించిన ఉపాధ్యాయులను సంగారెడ్డి జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి సస్పెన్షన్ చేస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. కంగ్టి ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్లో విద్యార్థులతో వంటలు చేసిన వార్తలు వెలువడడంతో నారాయణఖేడ్ ఆర్డీఓ అశోక్ చక్రవర్తిని విచారణకు ఆదేశించారు. విచారణ అనంతరం ఫిజికల్ డైరెక్టర్ మహేశ్, మ్యాథ్స్ టీచర్ శివకుమార్‌లను సస్పెన్షన్ చేశారు.
Similar News
News February 23, 2025
శెట్‌పల్లిలో చెరువులో మృతదేహం లభ్యం

మోర్తాడ్ మండలం శెట్‌పల్లి గ్రామానికి చెందిన బండ్ల భీమన్న(55) అనే వ్యక్తి చెరువులో పడి మరణించాడు. నాలుగు రోజుల నుంచి కనిపించకపోయినా ఆయన మృతదేహం చెరువులో లభ్యమైంది. నాలుగు రోజుల కిందట లక్ష్మీ కాల వద్దకు వెళ్లి అందులో స్నానం కోసం దిగగా బయటకు రాలేదు. కాలువ ప్రవాహానికి కొట్టుకొచ్చి చెరువులో శివమై తేలాడు. తమ్ముడు రాజన్న ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్ల ఎస్సై విక్రమ్ తెలిపారు.
News February 23, 2025
వికారాబాద్: అంగన్వాడీ పోస్టుల వివరాలు

జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాల్లో ఖాళీ పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. పలు జిల్లాలో ఎన్నికల కోడ్ ముగియగానే కలెక్టర్ నేతృత్వంలో నోటిఫికేషన్ జారీ చేసి రిక్రూట్మెంట్ చేయనున్నారు. జిల్లాలో 49 అంగన్వాడీ టీచర్ పోస్టులు, 238 మంది ఆయా పోస్టులు ఖాళీగా ఉన్నట్లు సమాచారం. అంగన్వాడీ కేంద్రాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను ఎన్నికల కోడ్ ముగియగానే భర్తీ చేసే అవకాశాలు ఉన్నాయి.
News February 23, 2025
భువనగిరి: వణికిస్తున్న బర్డ్ ఫ్లూ

భువనగిరి జిల్లాను బర్డ్ ఫ్లూ వణికిస్తోంది. ఆదివారం వచ్చిందంటే చాలు కచ్చితంగా చికెన్ కావాలనే పరిస్థితి నుంచి కోడిమాంసం తెచ్చుకోవాలంటే జంకే స్థితికి ప్రజలు వచ్చారు. బాయిలర్ కోళ్లతోపాటు ఫారం కోళ్లు, నాటుకోళ్లు కూడా చనిపోతున్నాయి. కాగా చౌటుప్పల్ మండల పరిధిలోని నేలపట్లలో బర్డ్ ఫ్లూ కేసు నమోదైన సంగతి తెలిసిందే.