News February 22, 2025
సంగారెడ్డి: విద్యార్థులు లక్ష్యం నిర్దేశించుకుని చదవాలి: ఎస్పీ

విద్యార్థులు లక్ష్యం నిర్దేశించుకుని చదవాలని ఎస్పీ రూపేష్ అన్నారు. సంగారెడ్డిలోని ఓ ప్రైవేట్ జూనియర్ కళాశాల వార్షికోత్సవం శనివారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు మత్తుపదార్థాలకు దూరంగా ఉండాలని చెప్పారు. కార్యక్రమంలో యువజన సంఘాల సమితి రాష్ట్ర అధ్యక్షుడు వేణుగోపాలకృష్ణ, కళాశాల ప్రిన్సిపల్ రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు.
Similar News
News February 23, 2025
ఏప్రిల్ 29న NCET.. నోటిఫికేషన్ విడుదల

2025-26లో నాలుగేళ్ల ఇంటిగ్రేటెడ్ బీఈడీ కోర్సుల్లో ప్రవేశానికి NCET(నేషనల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్) నోటిఫికేషన్ తాజాగా విడుదలైంది. మార్చి 16 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని జాతీయ ఉపాధ్యాయ విద్యామండలి తెలిపింది. APR 29న దేశవ్యాప్తంగా తెలుగు సహా 13 భాషల్లో పరీక్ష నిర్వహిస్తామంది. ర్యాంక్ ఆధారంగా 64 IIT, NIT, కేంద్రీయ వర్సిటీల్లో ప్రవేశాలు కల్పిస్తామని పేర్కొంది.
వెబ్‌సైట్: <
News February 23, 2025
సిద్దిపేట: నేడే గురుకుల పరీక్ష

తెలంగాణలోని వివిధ గురుకులాలలో 5వ తరగతిలో ప్రవేశాల కోసం నిర్వహించే TG-CET-2025 ప్రవేశ పరీక్షకు సిద్దిపేట జిల్లాలో ఏర్పాట్లు పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు. ప్రవేశ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ప్యాడ్‌తో పాటు బ్లాక్, బ్లూ పెన్నులు, ఆధార్ కార్డ్, పాస్ ఫోటోలతో రావాలని సూచించారు. ఉదయం 11 నుంచి 1 వరకు జరిగే పరీక్షలకు ఉదయం 9 గంటలకే విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని పేర్కొన్నారు.
News February 23, 2025
మద్దూరు: మహిళ అదృశ్యం.. కేసు నమోదు

మద్దూరు మండల పరిధిలో ఓ యువతి కనిపించకుండాపోయిన ఘటన ఈనెల 20న జరిగింది. పోలీసుల వివరాలిలా.. పల్లిగుండ్ల తండాకు చెందిన చిట్టిబాయ్ తన భర్త రవినాయక్‌తో గొడవ పడి ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. భర్తతో పాటు బంధువులు అన్ని ప్రాంతాల్లో వెతికినా ఆచూకీ లభించలేదు. చిట్టిబాయ్ తండ్రి లక్ష్మణ్ నాయక్ శనివారం మద్దూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసునమోదైనట్లు ఎస్ఐ విజయ్‌కుమార్ తెలిపారు.