News January 31, 2025
సంగారెడ్డి: ‘విద్యార్థులకు రుచికరమైన భోజనం పెట్టాలి’

సంగారెడ్డిలోని మహాత్మా జ్యోతిబాపూలే బీసీ గురుకుల పాఠశాలను కలెక్టర్ వల్లూరు క్రాంతి శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులకు రుచికరమైన భోజనం అందించాలని సూచించారు. గురుకుల పాఠశాలలో ఉన్న బియ్యం, కూరగాయలను పరిశీలించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. కార్యక్రమంలో తహశీల్దార్ దేవదాస్, RCO గౌతమ్ పాల్గొన్నారు.
Similar News
News November 6, 2025
మహబూబ్‌నగర్: సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి: ఎస్పీ

సైబర్ జాగ్రుక్ దివస్ సందర్భంగా జడ్చర్లలోని మార్కెట్ యార్డులో అవగాహన సదస్సును గురువారం నిర్వహించారు. జిల్లా ఎస్పీ జానకీ మాట్లాడుతూ.. సైబర్ నేరాలు విస్తృతంగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవడం అత్యవసరమన్నారు. సైబర్ నేరం జరిగిన వెంటనే https://www.cybercrime.gov.inలో లేదా 1930కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలన్నారు.
News November 6, 2025
బడికిరాని విద్యార్థులను తిరిగి తీసుకువచ్చే బాధ్యత CRPలదే: DSE

AP: బడికిరాని విద్యార్థుల ఇళ్లకు వెళ్లి వారు తిరిగి స్కూళ్లకు వచ్చేలా CRPలు చర్యలు తీసుకోవాలని పాఠశాల విద్యాశాఖ ఆదేశించింది. వెబ్‌ఎక్స్ మీటింగ్‌లో కమిషనర్ సమీక్షించారు. స్కూళ్లకు రాని వారికి హాజరు వేసినట్లు గుర్తిస్తే టీచర్లు, అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. SSC పరీక్షల కోసం విద్యార్థులకు 100 రోజుల ప్రణాళికను రూపొందించామన్నారు. దీన్ని ప్రభుత్వ స్కూళ్లలో తప్పనిసరిగా అమలు చేయాలని చెప్పారు.
News November 6, 2025
ఆస్ట్రేలియాపై భారత్ విక్టరీ

నాలుగో టీ20లో ఆస్ట్రేలియాపై భారత్ 48 రన్స్ తేడాతో విజయం సాధించింది. 168 రన్స్ టార్గెట్‌తో బరిలోకి దిగిన ఆసీస్ 18.2 ఓవర్లలో 119 పరుగులకే కుప్పకూలింది. టీమ్ ఇండియా బౌలర్లలో సుందర్ 3, అక్షర్, దూబే చెరో 2, వరుణ్, అర్ష్‌దీప్, బుమ్రా తలో వికెట్ తీశారు. దీంతో భారత్ 5 టీ20 సిరీస్‌లో 2-1తో లీడ్‌లో నిలిచింది. చివరి టీ20 ఈనెల 8న జరగనుంది.


