News April 10, 2025
సంగారెడ్డి: ‘వినియోగ ధ్రువపత్రాలు సమర్పించాలి’

జిల్లాలో రాష్ట్రీయ ఆవిష్కార్ సప్తహ కార్యక్రమంలో ఎంపికైన 78 ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు వినియోగ ధ్రువపత్రాలను సమర్పించాలని జిల్లా సైన్స్ అధికారి సిద్ధారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా సిద్దారెడ్డి మాట్లాడుతూ.. 2024 -25 విద్యాసంవత్సరానికి సంబంధించిన నిధులను పాఠశాల ఖాతాలో జమచేయడం జరిగిందని పేర్కొన్నారు.
Similar News
News March 2, 2026
నల్గొండ: రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి

నల్గొండ మండలం చందనపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గ్రామంలోని మిషన్ భగీరథ ట్రీట్మెంట్ ప్లాంటు సమీపంలో నకిరేకల్ నుంచి నల్గొండకు వస్తున్న బైక్, ఓ ప్రైవేట్ స్కూల్ వ్యాన్‌ను ఢీకొట్టడంతో బైక్‌పై ఉన్న ఇద్దరు చనిపోయారు. ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
News March 2, 2026
మదనపల్లెలో అధికారుల సస్పెండ్

మదనపల్లె, నిమ్మనపల్లె సహకార బ్యాంకుల్లో రుణాల మంజూరులో గోల్‌మాల్ జరిగింది. బంగారు రుణాల మంజూరులో నిమనపల్లె సహకార బ్యాంక్ త్రిమెన్ కమిటీ సీఈవోలు హరినాథ రెడ్డి, కరుణాకర రెడ్డి అవకతవకలకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. రూ.కోట్లు పక్కదారి పట్టాయని తెలుస్తోంది. దీంతో సీఈవోలను ఆ బ్యాంక్ జిల్లా కమిటీ సస్పెండ్ చేసింది. మదనపల్లె సహకార బ్యాంకు ఆఫీసియల్ పర్సన్ ఇన్‌ఛార్జ్ రఘునాథరెడ్డి సైతం సస్పెండ్ అయ్యారు.
News March 2, 2026
ఖమ్మం: 6 నెలలు రేషన్ తీసుకోకుంటే కష్టమే

వరుసగా ఆరు నెలల పాటు రేషన్ బియ్యం తీసుకోని లబ్ధిదారులపై పౌర సరఫరాల శాఖ ఆరా తీస్తోంది. క్షేత్రస్థాయి విచారణలో అనర్హులుగా తేలితే కార్డులు రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సుమారు 7 లక్షల పైచిలుకు కార్డులున్నాయి. వలస వెళ్లిన వారి వివరాలను తహశీల్దార్లు సేకరిస్తున్నారు. కార్డుదారులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.


