News April 1, 2025
సంగారెడ్డి: వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న జిల్లా కలెక్టర్

రాజీవ్ యువ వికాసం పథకంతో యువత ఆర్థికంగా ఎదగాలని కలెక్టర్ వల్లూరు క్రాంతి అన్నారు. హైదరాబాద్ నుంచి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ఈ పథకం కోసం ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు ఎక్కువ మంది దరఖాస్తు చేసుకునేలా చూడాలని చెప్పారు. రెవెన్యూ అధికారులు ద్రువపత్రాలను కూడా వెంటనే మంజూరు చేసేలా చూడాలని అధికారులకు తెలిపారు.
Similar News
News November 4, 2025
మంచిర్యాల జిల్లా జట్టుకు మొదటి స్థానం

దండేపల్లి మండలం రెబ్బనపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మంగళవారం నిర్వహించిన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా స్థాయి SGF అండర్-14 వాలీబాల్ పోటీల్లో మంచిర్యాల జిల్లా జట్టు ప్రథమ స్థానంలో నిలిచింది. ఈ పోటీల్లో 4 జిల్లాల నుంచి ప్రతిభ కనబర్చిన క్రీడాకారులను రాష్ట స్థాయికి పోటీలకు ఎంపిక చేసినట్లు SGF సెక్రటరీ యాకూబ్ తెలిపారు. అనంతరం విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు.
News November 4, 2025
ADB: ‘రేపు పత్తి కొనుగోళ్లు బంద్’

ఈనెల 5వ తేదీన గురునానక్ జయంతి, కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని పత్తి కొనుగోలు నిలిపివేశామని ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ అధికారులు మంగళవారం తెలియజేశారు. ఈనెల 6 నుంచి కొనుగోలు యధావిధిగా కొనసాగుతాయని పేర్కొన్నారు. రైతులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని వ్యవసాయ మార్కెట్ కమిటీ అధికారులు కోరారు.
News November 4, 2025
ఉమ్మడి మెదక్ జిల్లా ఖోఖో జట్ల ఎంపిక

తూప్రాన్ గురుకులంలో రాష్ట్రస్థాయి ఖోఖో పోటీలకు ఉమ్మడి మెదక్ జిల్లా సీనియర్ జట్లను ఎంపిక చేసినట్లు అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు హరికిషన్, శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. 150 మంది హాజరు కాగా, 15 మంది పురుషులు, 15 మంది మహిళలను ఎంపిక చేసినట్లు తెలిపారు. ఈనెల 6 నుంచి పెద్దపల్లిలో రాష్ట్రస్థాయి పోటీలలో పాల్గొంటారని వివరించారు.


