News August 17, 2025
సంగారెడ్డి: వేడి చేసిన నీటినే తాగండి: ఈఈ

జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు తాగునీటిని జాగ్రత్తగా వినియోగించుకోవాలని మిషన్ భగీరథ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ సూచించారు. మిషన్ భగీరథ గ్రిడ్ ద్వారా సరఫరా అవుతున్న నీరు శుద్ధి చేసి క్లోరినేషన్ అయినప్పటికీ, వర్షాల కారణంగా ఆరోగ్య పరంగా జాగ్రత్తలు తీసుకోవడం మంచిదన్నారు.
Similar News
News August 17, 2025
సమస్య ఉంటే ఫోన్ చెయ్యండి: విశాఖ మేయర్

ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో నగరవాసులకు ఎటువంటి ఇబ్బందులు వచ్చిన నేరుగా తనకు తెలియజేయాలని మేయర్ పీలా శ్రీనివాసరావు కోరారు. గ్రేటర్ పరిధిలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. ముఖ్యంగా లోతట్టు, కొండవాలు, తీర ప్రాంత ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తినా 99668 29999 నంబరుకు వెంటనే సంప్రదించాలని సూచించారు.
News August 17, 2025
పల్లాను కలిసిన నావల్ డాక్ యార్డ్ అప్రెంటిస్ అభ్యర్థులు

గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావును నావల్ డాక్ యార్డ్ అప్రెంటిస్ అభ్యర్థులు ఆదివారం ఆయన కార్యాలయంలో కలిశారు. ఇటీవల విడుదల చేసిన నావల్ డాక్ యార్డ్ రిక్రూట్మెంట్‌లో వయసు సరిపడక చాలామంది అభ్యర్థులు నష్టపోతున్నారని వినతి అందజేశారు. డాక్ యార్డ్‌లో అప్రెంటిషిప్ చేసిన అభ్యర్థులకు వయసు సడలింపు కల్పించేలా అధికారులతో సంప్రదింపులు జరపాలని కోరారు. పల్లాను కలిసిన వారిలో 150మంది అభ్యర్థులు ఉన్నారు.
News August 17, 2025
సంగారెడ్డి: 22 నుంచి స్కూల్ కాంప్లెక్స్ సమావేశాలు

సంగారెడ్డి జిల్లాలో ఈనెల 22 నుంచి స్కూల్ కాంప్లెక్స్ సమావేశాలు జరుగుతాయని డీఈవో వెంకటేశ్వర్లు ఆదివారం తెలిపారు. 22, 23 తేదీల్లో ప్రాథమిక పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయులు 50% చొప్పున హాజరుకావాలని పేర్కొన్నారు. 29న ఉన్నత పాఠశాలలో పనిచేసే లాంగ్వేజ్, 30న నాన్ లాంగ్వేజ్ ఉపాధ్యాయులకు శిక్షణ కార్యక్రమాలు జరుగుతాయని చెప్పారు.