News February 19, 2025
సంగారెడ్డి: వేసవి త్రాగునీటి ప్రణాళికలు తయారు చేయాలి: కలెక్టర్

జిల్లాలో రాబోయే వేసవిలో త్రాగునీటి సమస్యలు లేకుండా ప్రణాళికలు తయారు చేయాలని కలెక్టర్ వల్లూరు క్రాంతి ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయం నుంచి ఎంపీడీవోలతో మంగళవారం కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. మంచినీటి సమస్య ఎక్కువగా ఉన్న ప్రాంతాలను గుర్తించి నివేదికలు తయారు చేయాలని చెప్పారు. ఎక్కడైనా పైప్ లైన్ల రిపేర్లు ఉంటే మరమ్మత్తులు చేయాలని పేర్కొన్నారు.
Similar News
News July 7, 2025
విజయనగరం జిల్లాలో కూలిన వంతెన

సంతకవిటి మండలం కొండగూడెం-ఖండ్యాం మధ్య సాయన్నగెడ్డపై ఉన్న వంతెనపై ఆదివారం రాత్రి కుప్పకూలింది. దీనితో సంతకవిటి, రేగిడి ఆమదాలవలస, బూర్జ మండలాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. వంతెన కూలిన సమయంలో ఎటువంటి వాహనాలు రాకపోవడంతో ప్రమాదం తప్పింది. ఖండ్యాంలో ఇసుక రీచ్‌కు వస్తున్న భారీ లారీల కారణంగా వంతెన కూలిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. వెంటనే వంతెనకు మరమ్మతులు చేసి రాకపోకలు పునరుద్ధరించాలని కోరుతున్నారు.
News July 7, 2025
సంగారెడ్డి: కొత్త ఆస్పత్రుల ఏర్పాటుకు ప్రతిపాదనలు

సంగారెడ్డి జిల్లాలో కొత్తగా మూడు ప్రభుత్వ ఆస్పత్రుల ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపినట్లు వైద్య విధాన పరిషత్ డీసీహెచ్ఎస్ డాక్టర్ సంగారెడ్డి తెలిపారు. జిల్లాలలోని తెల్లాపూర్, కంగ్టి, గుమ్మడిదల-నర్సాపూర్ జాతీయ రహదారి మధ్య ట్రామా కేర్ సెంటర్‌లను ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు.
News July 7, 2025
‘రాష్ట్రంలో అనంత జిల్లా మొదటి స్థానంలో నిలవాలి’

మెగా పేరెంట్స్ టీచర్ మీటింగ్ 2.0ని రికార్డ్ సృష్టించేలా పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ అధికారులను ఆదేశించారు. ఆదివారం కలెక్టరేట్ క్యాంప్ కార్యాలయం నుంచి పేరెంట్ టీచర్స్ మీటింగ్‌పై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈనెల 10న సత్య సాయి జిల్లాలో జరిగే మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్‌కి సీఎం చంద్రబాబు పాల్గొనే అవకాశం ఉందన్నారు.