News April 18, 2025

సంగారెడ్డి: శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసుల కృషి: ఎస్పీ

image

జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ కోసం పోలీసులు 24 గంటలు అందుబాటులో ఉంటారని ఎస్పీ పరితోష్ పంకజ్ తెలిపారు. సంగారెడ్డిలోని ఎస్పీ జిల్లా కార్యాలయంలో కుల సంఘాల నాయకులతో శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఏమైనా అత్యవసరం అయితే 87126 56777 నంబర్‌కు ఫోన్ చేయాలని సూచించారు. గ్రామాల్లో ప్రజలకు అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తామని చెప్పారు. సమావేశంలో అదనపు ఎస్పీ సంజీవ రావు పాల్గొన్నారు.

Similar News

News February 21, 2026

ఎన్టీఆర్ జిల్లాలో TODAY TOP NEWS

image

* NTR: ఇంటర్ పరీక్షలకు సర్వం సిద్ధం
* విజయవాడ: రోడ్ల టెండర్ల పై దుమారం.. దోపిడీకి స్కెచ్
* మైలవరం: కేడిసిసి ఉద్యోగుల మానవహారం
* విజయవాడలో లంచం తీసుకుంటూ పట్టుపడ్డ MRO
* విజయవాడ నగరపాలక సంస్థ సమావేశంలో రచ్చ
* పామర్రు సమీపంలో ప్రమాదం.. ఒకరి మృతి
* చందర్లపాడు: మిర్చి పొలంలో గంజాయి సాగు.. మహిళా అరెస్ట్

News February 21, 2026

సంగారెడ్డి: రేపు గురుకులాల ప్రవేశ పరీక్ష

image

గురుకుల పాఠశాలల్లో 5వ తరగతిలో ప్రవేశం కోసం ప్రవేశ పరీక్ష ఆదివారం నిర్వహిస్తున్నట్లు జిల్లా కో-ఆర్డినేటర్ కల్పన తెలిపారు. 23 పరీక్ష కేంద్రాల్లో 8598 మంది విద్యార్థులు పరీక్ష రాస్తున్నారని చెప్పారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1 వరకు పరీక్ష జరుగుతుందని పేర్కొన్నారు. గంట ముందుగానే విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు.

News February 21, 2026

ఓపెన్ స్కూల్ టెన్త్, ఇంటర్ హాల్ టికెట్లు విడుదల: DEO

image

ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఓపెన్ స్కూల్ సొసైటీ (APOSS) సెకండరీ, ఇంటర్మీడియట్ థియరీ పరీక్షల హాల్ టికెట్లను విడుదల చేసినట్లు NTR జిల్లా విద్యాశాఖ అధికారిణి చంద్రకళ తెలిపారు. అభ్యర్థులు తమ మొబైల్ ద్వారా 9552300009 నంబర్‌కు Hi అని మెసేజ్ పంపి, అడ్మిషన్ నంబర్, పుట్టిన తేదీ వివరాలతో OTP ధృవీకరణ ద్వారా హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చని ఆమె సూచించారు.