News August 30, 2025
సంగారెడ్డి: ‘శాంతి భద్రతలకు సహకరించండి’

సంగారెడ్డి జిల్లాలో సెప్టెంబర్ 1 నుంచి 30 వరకు పోలీస్ చట్టం అమల్లో ఉంటుందని ఎస్పీ పారితోష్ పంకజ్ తెలిపారు. ముందస్తు అనుమతి లేకుండా ఎలాంటి ధర్నాలు, ర్యాలీలు, సభలు, సమావేశాలు, ఆందోళన కార్యక్రమాలను నిర్వహించరాదని స్పష్టం చేశారు. అనుమతి లేకుండా ఎవరైనా కార్యక్రమాలు చేపడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు. జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణకు ప్రజలు సహకరించాలని కోరారు.
Similar News
News August 30, 2025
5.5 లక్షల ఎకరాల్లో సోలార్ ప్రాజెక్ట్.. ప్రపంచంలోనే అతి పెద్దది!

గుజరాత్‌లోని కచ్ జిల్లాలో రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రపంచంలోనే అతిపెద్ద సోలార్ ప్రాజెక్టును ఏర్పాటు చేయనుంది. ‘ధీరూభాయ్ అంబానీ గ్రీన్ ఎనర్జీ గిగా కాంప్లెక్స్’ పేరిట దాదాపు 5.5 లక్షల ఎకరాల్లో దీనిని చేపట్టనుంది. ఇది సింగపూర్ దేశ విస్తీర్ణం కంటే దాదాపు 3 రెట్లు ఎక్కువ. ఇది 100 గిగావాట్ల పునరుత్పాదక శక్తిని ఉత్పత్తి చేయనుంది. ప్రాజెక్ట్ నిర్మాణం, నిర్వహణ కోసం స్థానికులకు వేలాది ఉద్యోగాలు రానున్నాయి.
News August 30, 2025
BREAKING: బద్వేల్ జనసేన ఇన్‌ఛార్జ్ మృతి

బద్వేల్ నియోజకవర్గం జనసేన ఇన్‌ఛార్జ్ బసవి రమేశ్ ఇటీవల అనారోగ్యానికి గురై హైదరాబాదులో చికిత్స పొందుతున్నారు. కాగా కొద్దిసేపటి క్రితం అతను మృతి చెందినట్లు వారి కుటుంబ సభ్యులు తెలిపారు. అంతకుముందు ఆయన అనారోగ్య పరిస్థితిపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆరా తీశారు. అనంతరం చికిత్స కోసం రూ.2 లక్షల సాయం చేశారు. అతని మృతి బాధాకరమని కార్యకర్తలు అన్నారు.
News August 30, 2025
MDCL: డిజేలు నడపొద్దు: DCP

మల్కాజ్‌గిరి పరిధిలో డీజే ఆపరేటర్లకు డీసీపీ పద్మజ వివిధ పోలీస్ అధికారులతో కలిసి ప్రత్యేక సమావేశం నిర్వహించినట్లు తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లోనూ డీజేలు నడపొద్దని, ఒకవేళ నడిపితే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రశాంతమైన వాతావరణంలో ఉత్సవాలు జరగటానికి అందరు సహకరించాలని డీసీపీ కోరారు.