News September 16, 2025

సంగారెడ్డి: ‘శారీరక వైకల్యం విద్యార్థుల ప్రొఫార్మా సమర్పించాలి’

image

జిల్లాలోని అన్ని పాఠశాలల్లో చదువుతున్న శారీరక వైకల్యం ఉన్న విద్యార్థుల ప్రొఫార్మా-I ను సమర్పించాలని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్ల తెలిపారు.అనంతరం ఆయన మాట్లాడుతూ.. శారీరక వైకల్యం ఉన్న విద్యార్థుల PH సర్టిఫికెట్లను డీఈవో కార్యాలయంలో సమర్పించాలన్నారు. మార్చి 2026లో జరిగే రెగ్యులర్ SSC పబ్లిక్ పరీక్షలకు CWSN అభ్యర్థులకు మినహాయింపులు ఇవ్వనున్నట్టు తెలిపారు.

Similar News

News September 17, 2025

‘నా మిత్రుడు ట్రంప్‌’కు ధన్యవాదాలు: PM మోదీ

image

ఉక్రెయిన్ వివాదానికి శాంతియుత పరిష్కారం కోసం అమెరికా చేసే చొరవలకు మద్దతు ఇస్తున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు. ‘నా 75వ పుట్టినరోజు సందర్భంగా ఫోన్ చేసి శుభాకాంక్షలు చెప్పిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌నకు ధన్యవాదాలు. మీలాగే, నేను కూడా భారతదేశం-అమెరికా సమగ్ర, ప్రపంచ భాగస్వామ్యాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్లడానికి పూర్తిగా కట్టుబడి ఉన్నాను’ అని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.

News September 17, 2025

ఆరోగ్య సంరక్షణకు ప్రత్యేక వైద్య శిబిరాలు: DMHO

image

మహిళల ఆరోగ్య సంరక్షణకు జిల్లాలో ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నట్లు బాపట్ల DMHO విజయమ్మ తెలిపారు. మంగళవారం వైద్య శిబిరాలకు సంబంధించి బాపట్లలో సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఈనెల 17 నుంచి అక్టోబర్ 2 వరకు ఆరోగ్యవంతమైన మహిళ.. శక్తివంతమైన కుటుంబం నినాదంతో జిల్లాలోని PHC, UPHCలు, సామాజిక ఆరోగ్య కేంద్రాలు, వైద్యశాలల్లో శిబిరాలు నిర్వహిస్తామన్నారు. మహిళలు ఈ శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు.

News September 17, 2025

త్వరలో మహిళా పాలసీ ప్రకటిస్తాం: మంత్రులు

image

TG: త్వరలో మహిళా పాలసీ ప్రకటిస్తామని మంత్రులు సురేఖ, సీతక్క వెల్లడించారు. ‘కుటుంబ బాధ్యతలు, వృత్తి బాధ్యతల్లో మహిళలు నిత్యం ఒత్తిడులకు గురవుతున్నారు. ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం కూడా చూసుకోవాలి. మహిళలు ఎదుర్కొంటున్న సవాళ్లపై ఈనెల 22న రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తాం. మహిళల సూచనలతో కొత్త మహిళా పాలసీని తీసుకొస్తాం’ అని సెక్రటేరియట్ మహిళా ఉద్యోగుల సంక్షేమ సంఘం లోగో ఆవిష్కరణ కార్యక్రమంలో పేర్కొన్నారు.