News February 13, 2025

సంగారెడ్డి: శిక్షణకు గైర్హాజరైన సిబ్బందికి మరోసారి శిక్షణ: కలెక్టర్

image

నాలుగు జిల్లాల గ్రాడ్యుయేట్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి నిర్వహించిన సిబ్బంది శిక్షణకు గైర్హాజరైన వారికి మరోసారి ట్రైనింగ్ ఇవ్వనున్నట్లు రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్  వల్లూరు క్రాంతి గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ఇప్పటికే ఎన్నికల్లో పాల్గొనే సిబ్బందికి మొదటి విడత శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు చెప్పారు. కాగా, ఎన్నికలకు అన్ని ఏర్పాట్లను పూర్తి చేస్తున్నట్లు పేర్కొన్నారు.

Similar News

News March 2, 2026

నిర్మల్: ఇంటర్ పరీక్షకు 317 మంది డుమ్మా

image

ఇంటర్మీడియట్ పరీక్షలలో భాగంగా సోమవారం నిర్వహించిన మొదటి సంవత్సరం గణితం పేపర్ 1ఏ, వృక్షశాస్త్రం, రాజకీయ శాస్త్రం పరీక్షలు జిల్లాలో ప్రశాంతంగా ముగిసినట్లు డీఐఈఓ పరశురాం తెలిపారు. మొత్తం 7,392 మంది విద్యార్థులకు గాను 7,075 మంది పరీక్ష రాశారని.. 317 మంది గైర్హాజరయ్యారని పేర్కొన్నారు. పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నాయని చెప్పారు.

News March 2, 2026

HYD: నీటిలో మురుగు.. జలమండలికి ఉరుకు!

image

నగర తాగునీటిలో కాలుష్య సెగ తగలకుండా జలమండలి ‘బస్తీ బాట’ పట్టింది. పైపులైన్లు లీకై మురుగునీరు కలిస్తే కఠిన చర్యలు తప్పవని సర్కారు హెచ్చరించడంతో అధికారులు కాలనీల్లో పర్యటిస్తున్నారు. రోజూ 5 వేల శాంపిల్స్ పరీక్షలు చేస్తున్నా, పురాతన పైపులైన్ మార్పు జలమండలికి పెద్ద తలనొప్పిగా మారింది. అక్రమ కనెక్షన్లే కాలుష్యానికి కేంద్రాలని గుర్తించి ఉక్కుపాదం మోపుతున్నారు.

News March 2, 2026

ట్రంప్ నిర్ణయానికి US ప్రజల మద్దతుందా?

image

US-ఇజ్రాయెల్ కలిసి ఇరాన్‌పై జరిపిన సైనిక దాడులను అమెరికా ప్రజలు స్వాగతించడం లేదని తెలుస్తోంది. ‘Reuters Ipsos’ సర్వే ప్రకారం కేవలం 25% మంది అమెరికన్లు మాత్రమే ఈ దాడులను సమర్థించారు. 43% మంది యుద్ధాన్ని వ్యతిరేకించగా 29% మంది అభిప్రాయం చెప్పలేదు. అమెరికా సైనికులు ప్రాణాలు కోల్పోతే ఈ మద్దతు మరింత తగ్గుతుందని సర్వే వెల్లడించింది. మధ్యంతర ఎన్నికల వేళ ఇది ట్రంప్ ప్రభుత్వానికి సవాల్‌గా మారొచ్చు.