News October 29, 2025
సంగారెడ్డి: ‘శిథిలావస్థ తరగతి గదుల్లో బోధన వద్దు’

జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో శిథిలావస్థలో ఉన్న తరగతి గదుల్లో బోధన నిర్వహించవద్దని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు ఆదేశించారు. పాఠశాలలో ప్రమాదకరంగా ఉన్న గదుల స్థానంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని, ఈ విషయాన్ని హెచ్ఎంలు తప్పక గమనించాలని సూచించారు. విద్యార్థుల భద్రతే ప్రధానమని, ఏవైనా ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్న గదుల్లో తరగతులు నిర్వహించకూడదని స్పష్టం చేశారు.
Similar News
News October 29, 2025
ఉద్యాన, వ్యవసాయ, సహకార శాఖల సమావేశం

భూపాలపల్లి జిల్లా ఐడీఓసీ కార్యాలయంలో బుధవారం ఉద్యాన, వ్యవసాయ, సహకార శాఖల సంయుక్త ఆధ్వర్యంలో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఉద్యాన శాఖ అధికారి ఏ.సునీల్‌కుమార్ మాట్లాడుతూ.. జిల్లాలో ఉద్యాన శాఖ తరపున అమలవుతున్న వివిధ పథకాల ప్రయోజనాలు, భౌతిక లక్ష్యాలు, రైతులకు చేరే మద్దతు, అలాగే శాఖల సమన్వయం ద్వారా అమలులో వేగం పెరగాలని సూచించారు.
News October 29, 2025
జనగామ: భారీ వర్షాలు.. కలెక్టరేట్లో కంట్రోల్ ఏర్పాటు!

భారీ వర్షాల నేపథ్యంలో జనగామ కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా వెల్లడించారు. భారీ వరదలు, రహదారుల ధ్వంసం, చెట్లు విరిగిపడడం, ఎలాంటి విపత్కర పరిస్థితుల్లోనైనా కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ నంబర్ 9052308621లో సంప్రదించాలని కోరారు. సిబ్బంది 24 గంటల పాటు అందుబాటులో ఉంటారని తెలిపారు.
News October 29, 2025
హిందూపురం ఘటనకు కల్తీ కల్లే కారణం: వైసీపీ

హిందూపురంలో 10 మంది అస్వస్థతకు గురవడానికి కారణం కల్తీ కల్లేననని <<18143030>>వైసీపీ<<>> ఆరోపించింది. ‘ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా నకిలీ మద్యం తాగి జనాలు ప్రాణాలు కోల్పోతున్నారు. అది చాలదన్నట్లు హిందూపురంలో కల్తీ కల్లు కలకలం రేపుతోంది. చంద్రబాబు చేతగానితనంతో రాష్ట్రంలో ఇంకెన్ని ఘోరాలు చూడాల్సి వస్తుందో’ అని ట్వీట్ చేసింది.


