News January 25, 2025

సంగారెడ్డి: శిథిల భవనాల్లో తరగతులు నిర్వహించొద్దు: కలెక్టర్

image

సంగారెడ్డి జిల్లాలోని శిథిలావస్థలో ఉన్న అంగన్వాడి, పాఠశాలల్లో తరగతులు నిర్వహించకూడదని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి ఉత్తర్వులు జారీ చేశారు. ఆమె మాట్లాడుతూ.. జిల్లాలో శిథిలావస్థలో ఉన్న అంగన్వాడి పాఠశాల భవనాల వివరాలను సమర్పించాలని ఆదేశించారు. ప్రత్యామ్నాయ గదులు చూసి విద్యార్థులకు తరగతులు నిర్వహించాలని సూచించారు.

Similar News

News February 8, 2026

చిత్తూరు జిల్లా వ్యాప్తంగా పోలీసుల తనిఖీలు

image

చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఎస్పీ తుషార్ డూడీ ఆదేశాల మేరకు పోలీసు సిబ్బంది తనిఖీలు చేపట్టారు. మాదకద్రవ్యాల అక్రమ రవాణా, విక్రయాలను అరికట్టేందుకు తనిఖీలు నిర్వహించినట్టు అధికారులు తెలియజేశారు. అనుమానాస్పద వ్యక్తులు, వాహనాలు, లాడ్జీలు, బస్సు స్టాండ్ లలో సోదాలు నిర్వహిస్తున్నారు. మాదకద్రవ్యాల కేసులలో పట్టుపడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

News February 8, 2026

విజయనగరం జిల్లాలో వివిధ ప్రాజెక్టులకు ప్రతిపాదనలు

image

జిల్లాలో పలు అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రతిపాదనలు పంపుతున్నట్లు కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి శనివారం తెలిపారు.
➭బాడంగి, గరివిడి, ఎస్.కోటలో మూడు ఫుడ్ పార్కులు ఏర్పాటు
➭పూసపాటిరేగ మండలం రెల్లివలసలో 201 ఎకరాల్లో హెల్త్‌కేర్ ప్రాజెక్ట్
➭ఎస్.కోట–కొత్తవలసలో ప్రైవేట్ ఇండస్ట్రియల్ పార్కులు
➭10 వేల ఎకరాల్లో ఉద్యానవనాలు (అరటి, ఆయిల్‌పామ్) సాగు, పెంపకం వంటి ప్రతిపాదనలు

News February 8, 2026

విశాఖలో మోడ్రన్ కియోస్కులు..

image

విశాఖ వీధులకు సరికొత్త అందాన్ని తెచ్చేలా నెల్లూరు తరహాలో జీవీఎంసీ ‘స్మార్ట్ వెండింగ్ జోన్ల’ ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. సెంట్రల్ పార్క్, ఎండాడ, దువ్వాడలలో అత్యాధునిక మాడ్యులర్ కియోస్కులను నిర్మించనున్నారు. వీటికి సోలార్ పవర్, డిజిటల్ పేమెంట్స్, సీసీటీవీ నిఘా వంటి సౌకర్యాలు ఉంటాయి. వీధి వ్యాపారులకు శాశ్వత చిరునామాను కల్పిస్తూ, ట్రాఫిక్ ఇబ్బందులు లేని నగరంగా తీర్చి దిద్దడమే ఈ ప్రాజెక్ట్ లక్ష్యం.