News October 8, 2025
సంగారెడ్డి: సదరం శిబిరం షెడ్యూలు విడుదల

దివ్యాంగుల కోసం అక్టోబర్ నెలకు సంబంధించిన సదరం షెడ్యూలు విడుదలైనట్లు జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండ్ డాక్టర్ మురళీకృష్ణ మంగళవారం తెలిపారు. ఆయన మాట్లాడుతూ ..ఈనెల 14, 16, 18, 21, 23, 25, 28, 30 తేదీల్లో సదరం శిబిరాలు జరుగుతాయని చెప్పారు. దివ్యాంగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
Similar News
News October 8, 2025
రాజమండ్రిలో హౌస్ బోట్లు

రాజమండ్రిలో టూరిస్టుల కోసం త్వరలో హౌస్ బోట్లు అందుబాటులోకి రానున్నాయి. రూ. 94 కోట్లతో చేపట్టిన అఖండ గోదావరి ప్రాజెక్టులో భాగంగా మూడు హౌస్ బోట్లు, నాలుగు జల క్రీడల బోట్లు సిద్ధమవుతున్నట్లు అధికారులు తెలిపారు. వీటిని కొవ్వూరు గోష్పాద క్షేత్రం, పుష్కర్ ఘాట్, సరస్వతీ ఘాట్‌లలో ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే వీటికి సంబంధించిన టెండర్ల ప్రక్రియ పూర్తయిందని జిల్లా టూరిస్ట్ ఆఫీసర్ వెంకటాచలం తెలిపారు.
News October 8, 2025
రోజూ ‘ఓం గం గణపతయే నమః’ అని పఠిస్తే..?

ఈ మంత్రాన్ని రోజూ జపిస్తే విఘ్నేశ్వరుడి అనుగ్రహంతో అడ్డంకులు తొలగి, జ్ఞానం, శ్రేయస్సు వృద్ధి చెందుతాయని పండితులు చెబుతున్నారు. ‘జపమాలతో పాటు ఈ మంత్రాన్ని 108 సార్లు ఉచ్ఛరిస్తే మనలోని అసమతుల్యతలు తొలగి, మనసుకు స్థిరత్వం లభిస్తుంది. దోషాలు పోతాయి. దైవత్వం వైపు అడుగు పడుతుంది’ అని వివరిస్తున్నారు. ✍️ ప్రతిరోజు ఆసక్తికరమైన ఆధ్యాత్మిక సమాచారం కోసం <<-se_10013>>భక్తి<<>> కేటగిరీకి వెళ్లండి.
News October 8, 2025
గోదావరిఖని- మేడారంకు SPECIAL BUS

గోదావరిఖని RTC డిపో నుంచి ఈనెల 10న ఉదయం 5 గంటలకు మేడారానికి స్పెషల్ బస్ బయలుదేరుతుందని, ఈ ట్రిప్‌లో రామప్ప, లక్నవరం, మేడారం(సమ్మక్క, సారలమ్మ), బొగత వాటర్ ఫాల్స్(తెలంగాణ నయాగరా జలపాతాలు) సందర్శించవచ్చని డిపో మేనేజర్ నాగభూషణం తెలిపారు. టికెట్ ధర ఒక్కొక్కరికి రూ.1,000 అని, అదేరోజు రాత్రి తిరిగి గోదావరిఖనికి బస్సు చేరుకుంటుందని చెప్పారు. రిజర్వేషన్ల కొసం 7382847596 నంబర్‌ను సంప్రదించాలన్నారు.