News November 10, 2025

సంగారెడ్డి: సమస్యలు ఉంటే నేరుగా ఫిర్యాదు చేయొచ్చు: ఎస్పీ

image

ఎలాంటి సమస్యల ఉన్న నేరుగా ఎస్పీ కార్యాలయంలో తనను కలిసి ఫిర్యాదు చేయవచ్చని ఎస్పీ పారితోష్ పంకజ్ అన్నారు. ఎస్పీ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం సోమవారం నిర్వహించారు. ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదుదారులతో నేరుగా మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులు వెంటనే పరిష్కరించాలని సంబంధిత స్టేషన్ల ఎస్ఐలను ఆదేశించారు.

Similar News

News November 10, 2025

KNR: ఫుడ్ పాయిజన్ ఘటనపై బండి సంజయ్ ఆరా

image

జమ్మికుంట ప్రాథమిక పాఠశాలలో జరిగిన <<18250681>>ఫుడ్ పాయిజన్ ఘటన<<>>పై కేంద్రమంత్రి బండి సంజయ్ స్పందించారు. జిల్లా కలెక్టర్ పమేలా సత్పతికి ఆయన ఫోన్ చేసి ఘటనకు సంబంధించిన వివరాలపై ఆరా తీశారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి గురించి ఆమెను అడిగి తెలుసుకున్నారు. కాగా, ప్రస్తుతం పిల్లల ఆరోగ్యం నిలకడగానే ఉందని కలెక్టర్ మంత్రికి వివరించారు. మెరుగైన చికిత్స కోసం KNR ఆసుపత్రికి తరలించాలన్నారు.

News November 10, 2025

అత్యంత స్వచ్ఛమైన గాలి లభించే నగరాలివే!

image

ప్రస్తుతం చాలా నగరాలను గాలి కాలుష్యం వెంటాడుతోంది. AQI లెవెల్స్ భారీగా పెరగడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఢిల్లీలో ఏకంగా 500+AQI నమోదవుతోంది. ఈ నేపథ్యంలో ఇండియాలో స్వచ్ఛమైన గాలి లభించే టాప్-5 నగరాలేవో తెలుసుకుందాం. 1. షిల్లాంగ్(మేఘాలయ)-12, 2.అహ్మద్‌నగర్(MH)-25, 3.మధురై(TN)-27, 4. మీరా భయందర్(MH)-29, 5. నాసిక్‌(MH)- 30 ఉన్నాయి. కాగా హైదరాబాద్‌లో 140+ AQI నమోదవుతోంది.

News November 10, 2025

రేపే పోలింగ్.. స్కూళ్లు, ఆఫీసులకు సెలవు

image

TG: రేపు జూబ్లీహిల్స్ ఉపఎన్నిక పోలింగ్ నేపథ్యంలో ఆ నియోజకవర్గ పరిధిలో కలెక్టర్ హరిచందన ఇప్పటికే సెలవు ప్రకటించారు. అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలు, కార్యాలయాలు, ఐటీ ఆఫీసులకు ఈ హాలిడే వర్తిస్తుంది. అటు ఈ నెల 14న కౌంటింగ్ జరిగే చోట సెలవు ఇవ్వాలని అధికారులు ఆదేశించారు.