News April 22, 2025
సంగారెడ్డి: సిబిల్ స్కోర్‌తో సంబంధం లేకుండా RYV అందించాలి: కలెక్టర్

సిబిల్ స్కోర్‌తో సంబంధం లేకుండా రాజీవ్ వికాసం పథకాన్ని అందించాలని బ్యాంకులకు కలెక్టర్ వల్లూరు క్రాంతి ఆదేశించారు. కలెక్టరేట్లో రాజీవ్ యువ వికాసం పై సమీక్ష సమావేశం సోమవారం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. మొత్తం 51,657 దరఖాస్తులు వచ్చినట్లు చెప్పారు. నిస్సహాయులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, నిరుద్యోగులకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని పేర్కొన్నారు. అదరపు కలెక్టర్ చంద్రశేఖర్ పాల్గొన్నారు.
Similar News
News April 22, 2025
నేడే ఇంటర్ ఫలితాలు.. NGKLలో 13,454 మంది

తెలంగాణ ఇంటర్ బోర్డు ఫలితాలను నేడు విడుదల చేయనున్నారు. నాగర్ కర్నూల్ జిల్లాలో మొత్తం 13,454 ఇంటర్ విద్యార్థులు ఉన్నారు. ఇందులో ఫస్టియర్‌లో 6,477, సెకండియర్‌లో 6,977 మందికి పరీక్షలు నిర్వహించారు. కాగా వీరి భవితవ్యం నేటితో తేలనుంది. ఫలితాలను Way2Newsలో అందరికంటే ముందే తెలుసుకోండి.
– ALL THE BEST
News April 22, 2025
విజయవాడలో మృతదేహం కలకలం

విజయవాడ కస్తూరిబాయిపేటలో సోమవారం సాయంత్రం మృతదేహం కలకలం రేపింది. సూర్యారావుపేట పోలీసుల వివరాల ప్రకారం.. బోసు బొమ్మ సెంటర్‌లో గుర్తుతెలియని వ్యక్తి మృతి చెంది ఉన్నాడన్న సమాచారం మేరకు పరిశీలించామన్నారు. మృతుడి వయసు సుమారు 40 నుంచి 45 మధ్య ఉంటుందని చెప్పారు. ఈ వ్యక్తి ఎవరికైనా తెలిస్తే సూర్యారావుపేట పోలీస్ స్టేషన్లో సంప్రదించాలి అన్నారు.
News April 22, 2025
నేడు జిల్లాకు జలవనరుల శాఖ మంత్రి పర్యటన

రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు మంగళవారం జిల్లాలో పర్యటించనున్నారు. విజయనగరం నుంచి మధ్యాహ్నం 1:30 కు రోడ్డు మార్గంలో బయలుదేరి 3:30 గంటలకు టెక్కలి చేరుకుంటారు. వంశధార ఎడమ ప్రధాన కాలువను పరిశీలిస్తారు. సాయంత్రం 5:30 కు శ్రీకాకుళం కలెక్టరేట్ చేరుకుంటారు. 6:30 గంటల వరకు అధికారులతో కలెక్టరేట్‌లో సమీక్ష నిర్వహిస్తారు. రాత్రి 7గంటలకు విశాఖపట్నం బయలు దేరుతారు.