News January 29, 2025
సంగారెడ్డి: సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడిగా జయరాజ్

సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడిగా సంగారెడ్డికి చెందిన జయరాజ్‌ను రాష్ట్ర మహాసభల్లో మంగళవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. పార్టీ జిల్లా కార్యదర్శిగా ప్రస్తుతం పని చేస్తున్నారు. ఎస్ఎఫ్ఐ, రైతు సంఘాల్లో కూడా బాధ్యతలు చేపట్టారు. జయరాజ్ మాట్లాడుతూ.. తనకు మొదటిసారిగా రాష్ట్ర కమిటీలో చోటు కల్పించినందుకు కృతజ్ఞతలు తెలిపారు.
Similar News
News November 8, 2025
అల్లూరి: డెంటల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్ హెచ్ఎం) పరిధిలో జిల్లాలో డెంటల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయిందని డీఎంహెచ్‌వో డాక్టర్ డీ.కృష్ణమూర్తి నాయక్ శుక్రవారం తెలిపారు. డెంటల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులను కాంట్రాక్టు ప్రాతిపదికన భర్తీ చేయడం జరుగుతుందన్నారు. పూర్తి వివరాలకు జిల్లా అధికారిక వెబ్సైట్ allurisitharamaraju.ap.gov.inను సంప్రదించి, దరఖాస్తు చేసుకోవాలని అభ్యర్థులకు సూచించారు.
News November 8, 2025
అనకాపల్లి: ఈనెల 10 నుంచి జిల్లా స్థాయి యువజనోత్సవాలు

జిల్లాస్థాయి యువజనోత్సవాలను ఈనెల 10వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు కలెక్టర్ విజయ కృష్ణన్ తెలిపారు. ఈ మేరకు కలెక్టరేట్‌లో శుక్రవారం సాయంత్రం గోడపత్రికను ఆవిష్కరించారు. అనకాపల్లిలో 10వ తేదీన 15-29 ఏళ్లలోపు యువ కళాకారులకు 7 విభాగాల్లో పోటీలు జరుగుతాయన్నారు. ఈ పోటీల్లో ప్రతిభ కనబరిచిన వారు రాష్ట్రస్థాయికి ఎంపిక అవుతారన్నారు. ఈ కార్యక్రమంలో సెట్విస్ సీఈవో కవిత పాల్గొన్నారు.
News November 8, 2025
ప్రీటెర్మ్ బర్త్‌కు ఇదే కారణం

గర్భధారణ తర్వాత తొమ్మిది నెలలు నిండాక బిడ్డకు జన్మనివ్వడం సాధారణం. కానీ మరికొందరిలో నెలలు నిండక ముందే ప్రసవం జరుగుతుంది. దీన్నే ప్రీటెర్మ్ బర్త్ అని కూడా అంటారు. ఇలా నెలల నిండకుండానే డెలివరీ కాకపోవడానికి పోషకాహార లోపం, రక్తహీనత, మానసిక సమస్యలే ముఖ్య కారణమని ఓ అధ్యయనంలో వెల్లడైంది. ఇలా ఎక్కువగా స్ట్రెస్ కాకుండా ప్రశాంతంగా ఉంటూ పోషకాహారం తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.


