News October 14, 2025
సంగారెడ్డి: సులభమైన పద్ధతిలో బోధన చేయాలి: ఎంఈఓ

సంగారెడ్డి మండలం ఇస్మాయిల్ ఖాన్ పేటలో డిజిటల్ లెర్నింగ్ విద్యపై నిర్వహిస్తున్న ఉపాధ్యాయుల శిక్షణ కార్యక్రమాన్ని మండల విద్యాధికారి విద్యాసాగర్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎంఈఓ మాట్లాడుతూ.. డిజిటల్ పద్ధతిలో విద్యార్థులకు బోధన చేస్తే సులభంగా అర్థం చేసుకుంటారని అన్నారు. వివిధ మండలాలకు చెందిన ఉపాధ్యాయులు, ఆర్పీలు పాల్గొన్నారు.
Similar News
News October 14, 2025
ఇది భారత చరిత్రలో నిలిచిపోయే రోజు: అదానీ

గూగుల్‌తో కలిసి దేశంలోనే అతిపెద్ద AI డేటా సెంటర్‌ను విశాఖలో నిర్మిస్తున్నందుకు గర్వంగా ఉందని అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ అన్నారు. ‘ఇది భారత చరిత్రలో నిలిచిపోయే రోజు. దేశంలోని అత్యంత కీలకమైన విద్య, వ్యవసాయం, ఫైనాన్స్ తదితర రంగాలకు AI ద్వారా పరిష్కారాలు చూపే ఎకోసిస్టమ్‌ను ఈ హబ్ క్రియేట్ చేస్తుంది. AI రెవల్యూషన్‌కు తోడ్పడే ఇంజిన్‌ను నిర్మించడాన్ని గౌరవంగా భావిస్తున్నాం’ అని ట్వీట్ చేశారు.
News October 14, 2025
ఎచ్చెర్ల: ‘పోస్ట్ గ్రాడ్యుయేషన్‌లో 42 శాతం ప్రవేశాలు’

రాష్ట్రవ్యాప్తంగా విశ్వవిద్యాలయాలకు నిర్వహించిన ఏపీ పీజీ సెట్ -2025 రెండో విడత కౌన్సిలింగ్ అలాట్మెంట్లను కన్వీనర్ ప్రొఫెసర్ వెంకటేశ్వర్లు సోమవారం ప్రకటించారు. డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ విద్యాలయంలో 19 పీజీ కోర్సుల్లో 600 సీట్లు ఉండగా 253 ప్రవేశాలు జరిగాయన్నారు. 42% ప్రవేశాలు మాత్రమే జరిగాయి. కనీసం పీజీ కోర్సులో 50% ప్రవేశాలు జరగకపోవటం గమనార్హం. కొన్ని కోర్సుల్లో కనీస ప్రవేశాలు జరగలేదు.
News October 14, 2025
మట్టి దీపాలు కొంటే.. ‘పేదింట్లోనూ దీపావళి’

దీపావళి సమీపిస్తున్న సందర్భంగా ప్రజలందరూ ఖరీదైన, కృత్రిమ డెకరేషన్ లైట్లకు బదులుగా సంప్రదాయ మట్టి దీపాలు వెలిగించాలని నెటిజన్లు కోరుతున్నారు. మట్టి దీపాలు, ఇతర అలంకరణ వస్తువులను చిరు వ్యాపారులు లేదా స్థానిక తయారీదారుల వద్ద కొనుగోలు చేయాలని సూచిస్తున్నారు. దీనివల్ల వారిని ఆర్థికంగా ఆదుకున్నట్లు అవుతుందంటున్నారు. ఈ పండుగ వేళ వారికి వెలుగునిచ్చి, వారి జీవితాల్లో ఆనందాన్ని నింపవచ్చని చెబుతున్నారు.