News October 1, 2024
సంగారెడ్డి: సెల్ ఫోన్ రిపేరింగ్ పై ఉచిత శిక్షణ

సెల్ ఫోన్ రిపేరింగ్ ఉచిత శిక్షణ కోసం అర్హులైన పురుషుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు స్టేట్ బ్యాంక్ గ్రామీణ సమయం ఉపాధి శిక్షణ కేంద్రం డైరెక్టర్ రాజేంద్రప్రసాద్ సోమవారం తెలిపారు. 18 నుంచి 45 ఏళ్లు వయసున్న వారు అర్హులని చెప్పారు. సంగారెడ్డి, మెదక్ జిల్లాలకు చెందిన దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. ఎంపికైన వారికి అక్టోబర్ 14 నుంచి నెలరోజుల పాటు శిక్షణ ఉంటుందన్నారు.
Similar News
News February 14, 2026
రామాయంపేటలో అధికార పార్టీకే పట్టం

రామాయంపేట మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు మరోసారి అధికార పార్టీకి జై కొట్టారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన తొలి ఎన్నికల్లో 8 స్థానాలను ఆ పార్టీకి అందించిన ఓటర్లు, నేడు జరిగిన రెండో సార్వత్రిక ఎన్నికల్లోనూ అదే రీతిన కాంగ్రెస్ పార్టీకి 8 కౌన్సిలర్ స్థానాలను కట్టబెట్టారు. అధికార పార్టీతోనే పట్టణాభివృద్ధి సాధ్యమని ఆకాంక్షిస్తూ ప్రజలు ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
News February 14, 2026
మెదక్: మున్సిపాలిటీలకు ప్రిసైడింగ్ అధికారుల నియామకం

మెదక్ జిల్లాలోని 4 మున్సిపాలిటీల చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికల నిర్వహణకు కలెక్టర్ రాహుల్ రాజ్ నలుగురు ప్రిసైడింగ్ అధికారులను నియమించారు. మెదక్ మున్సిపాలిటీకి ఎల్లయ్య(ZP CEO), రామాయంపేటకు జయచంద్రారెడ్డి(RDO తూప్రాన్), నర్సాపూర్‌కు రమాదేవి(RDO మెదక్), తూప్రాన్‌కు మహిపాల్(RDO నర్సాపూర్) అధికారులను కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా జరిగేలా చూడాలని కలెక్టర్ ఆదేశించారు.
News February 14, 2026
రామాయంపేట: డైరెక్టర్‌గా ఉంటూ.. కౌన్సిలర్‌గా గెలుపు

మహంకాళి దేవాలయం డైరెక్టర్‌గా సేవలు అందిస్తున్న బైరం స్వప్న, ఇప్పుడు రామాయంపేట కౌన్సిలర్‌గా తన ముద్ర వేశారు. 4వ వార్డు నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగిన ఆమె, సమీప బీఆర్‌ఎస్ అభ్యర్థిపై 139 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. గతంలోనే ఆమెను దేవాలయ డైరెక్టర్‌గా ఎమ్మెల్యే రోహిత్ నియమించారు. ఆధ్యాత్మిక సేవలతో పాటు ఇప్పుడు వార్డు అభివృద్ధికి కృషి చేస్తానని స్వప్న ధీమా వ్యక్తం చేశారు.


