News September 14, 2025
సంగారెడ్డి: సైబర్ క్రైమ్ కేసుల్లో రూ.1.50 కోట్లు రికవరీ

జాతీయ లోక్ అదాలత్‌లో భాగంగా సైబర్ క్రైమ్ కేసుల కింద రూ.1.50 కోట్లు రికవరీ చేసినట్లు సంగారెడ్డి ఎస్పీ పరితోష్ పంకజ్ తెలిపారు. క్షణికావేశంలో చేసిన తప్పులకు లోక్ అదాలత్ ద్వారా పరిష్కారం పొందవచ్చని అన్నారు. సైబర్ బాధితులకు న్యాయం అందించేందుకు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో నిరంతరం కృషి చేస్తుందని ఎస్పీ పేర్కొన్నారు.
Similar News
News September 14, 2025
లిబర్టీ వద్ద మాజీ సీఎం బూర్గులకు నివాళులు

బూర్గుల రామకృష్ణారావు వర్ధంతి సందర్భంగా లిబర్టీ క్రాస్ రోడ్‌లోని ఆయన విగ్రహానికి టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్ పూలమాలలువేసి నివాళులర్పించారు. బూర్గుల సీఎం చెరగని ముద్ర వేశారని, భవిష్యత్ తరాలకు ఆయన స్ఫూర్తిదాయక నేతగా నిలిచారన్నారు. ఆయన దూర దృష్టి ఇప్పటికి మనందరికీ ఆదర్శమని కీర్తించారు.
News September 14, 2025
యురేనియం వల్ల ఆరోగ్య సమస్యలొస్తాయా?

AP: తురకపాలెంలో ఇటీవల సంభవించిన మరణాలకు యురేనియమే కారణమని స్థానికులు భావిస్తున్నారు. తాజాగా నీటి శాంపిల్స్‌లో <<17705296>>యురేనియం అవశేషాలు<<>> బయటపడినట్లు వార్తలు రాగా, దీనిపైనే చర్చ జరుగుతోంది. కాగా నీరు, ఆహారం వల్ల యురేనియం శరీరంలోకి ప్రవేశిస్తే కిడ్నీల ఆరోగ్యానికి చేటు చేస్తాయని వైద్యులు చెబుతున్నారు. చర్మం, లివర్, లంగ్స్, ఎముకలపై ప్రభావం చూపి అనారోగ్యానికి కారణం అవుతుందని వెల్లడిస్తున్నారు.
News September 14, 2025
నెక్లెస్ రోడ్డుకు ఆ పేరు ఏలా వచ్చిందో తెలుసా?

HYDలో ప్రసిద్ధ హుస్సేన్‌సాగర్ సరస్సు ఒడ్డున ఉన్న నెక్లెస్ రోడ్, పర్యాటకుల వినోదానికి అద్భుతమైన ప్రదేశం. రోడ్డును పై నుంచి చూసినప్పుడు, సరస్సును చుట్టి ఉన్న ఆభరణం ఆకారంలో కనిపించడమే ‘నెక్లెస్ రోడ్’ అనటానికి కారణం అయింది. ముత్యాలహారంలాగా సరస్సును చుట్టుకోవడంతో ఈ పేరు వచ్చింది. సంజీవయ్య పార్క్ నుంచి ప్రారంభమై ఎన్టీఆర్ గార్డెన్స్, లుంబినీ పార్క్ మీదుగా ట్యాంక్‌బండ్‌తో కలుస్తుంది.