News April 24, 2025
సంగారెడ్డి: సోషల్ మీడియాలో అసత్య ప్రచారంపై చర్యలు: ఐజీ

సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మల్టీజోన్-2 ఐజీ సత్యనారాయణ హెచ్చరించారు. సంగారెడ్డి ఎస్పీ కార్యాలయంలో బుధవారం మీడియాతో మాట్లాడారు. జిన్నారంలో 19న కొన్ని కోతులు గుట్టపై శివుని విగ్రహం కింద పడేయడంతో ధ్వంసమైనట్లు విచారణ తేలిందన్నారు. 22న గేమ్స్ ఆడుకొని శివాలయం వైపు వెళ్తున్న మదార్సా విద్యార్థులను చూసి కొందరు ప్రశ్నించినట్లు పేర్కొన్నారు.
Similar News
News April 24, 2025
ఎన్టీఆర్: బీటెక్ పరీక్షల ఫలితాలు విడుదల

ఆచార్య నాగార్జున యూనివర్శిటీ(ANU) పరిధిలో జనవరి- 2025లో నిర్వహించిన బీటెక్ 1వ సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షల ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్‌లో తమ రిజిస్టర్ నెంబర్ ద్వారా రిజల్ట్స్ తెలుసుకోవచ్చు. పరీక్షల ఫలితాలకై అధికారిక వెబ్‌సైట్ https://www.nagarjunauniversity.ac.in// చెక్ చేసుకోవాలని ANU పరీక్షల విభాగం సూచించింది.
News April 24, 2025
వనపర్తి: లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఏఈ

వనపర్తి జిల్లా ఖిల్లాఘణపురం మండలం మల్కాపూర్‌లోని రైస్ మిల్లులో 160 కేవీ పనులకు సంబంధించి బిల్లును అప్రూవ్ చేయాలని కాంట్రాక్టర్ సలీం సదరు ఏఈ కొండయ్యను కోరగా రూ.20 వేలు డిమాండ్ చేశారు. దీంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించారు. బుధవారం వనపర్తి విద్యుత్ కార్యాలయంలో కొండయ్య రూ.10వేలు లంచం తీసుకుంటుండగా పట్టుకున్నట్లు ఏసీబీ డీఎస్పీ బాలకృష్ణ తెలిపారు. ఏఈని నాంపల్లి కోర్టుకు తరలిస్తామని చెప్పారు.
News April 24, 2025
పదో తరగతి ఉత్తీర్ణతలో 98.41%తో పద్మనాభం టాప్

విశాఖ జిల్లాలో మండలాల వారీగా 10వ తరగతి ఉత్తీర్ణత శాతాన్ని జిల్లా విద్యాశాఖ అధికారి ప్రేమ్ కుమార్ వెల్లడించారు. పద్మనాభం 98.41%తో మొదటి స్థానంలో, విశాఖ అర్బన్ 83.17%తో చివరి స్థానంలో నిలిచాయి. ఆనందపురం 89.78, భీమునిపట్నం 91.74, చినగదిలి 85.27, గాజువాక 90.22, గోపాలపట్నం 89.78, ములగాడ 92.29, పెదగంట్యాడ 83.75, పెందుర్తి 91.14, సీతమ్మధార 91.57% ఉత్తీర్ణత సాధించాయి.